ఆర్డీటీ కోసం ఉద్యమం ఉధృతం | - | Sakshi
Sakshi News home page

ఆర్డీటీ కోసం ఉద్యమం ఉధృతం

Feb 18 2026 7:13 AM | Updated on Feb 18 2026 7:13 AM

ఆర్డీటీ కోసం ఉద్యమం ఉధృతం

ఆర్డీటీ కోసం ఉద్యమం ఉధృతం

అనంతపురం అర్బన్‌: ఆర్డీటీని కాపాడుకునేందుకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని అఖిలపక్ష కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేసే వరకూ ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. ఇప్పటికై నా జిల్లా మంత్రులు, ఎంపీలు ఆర్డీటీపై కపట ప్రేమను వీడి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌కు చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయకపోవడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిలో భాగంగా మంగళవారం అనంతపురంలోని క్లాక్‌టవర్‌ నుంచి ర్యాలీగా పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాల వద్దకు అఖిలపక్ష కమిటీ నాయకులు చేరుకుని రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ కన్వీనర్‌ సాకే హరి, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, తదితరులు మాట్లాడారు. 60 ఏళ్లుగా పేదలకు విద్య, వైద్య, ఆర్థికాభివృద్ధి సాధనకు పాటుపడుతున్న ఆర్డీటీని జిల్లా నుంచి పంపించేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ ఎక్కడున్నావంటూ ప్రశ్నించారు. లక్షల మంది పేదలకు జీవనాధారమైన ఆర్డీటీ అంశంపై పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్కరూ చర్చ లేవనెత్తకపోవడంతో పాలకుల నిజ స్వరూపం బయటపడిందన్నారు. నిజాయితీతో, నిబద్ధతతో సేవలందిస్తున్న ఆర్డీటీని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటాలకై నా సిద్ధమన్నారు. అఖిలపక్ష కమిటీ చేపడుతున్న ఉద్యమాలకు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఐఎంఎల్‌ లిబరేషన్‌, ఐఎఫ్‌టీయూ, ప్రజాసంఘాల నాయకులు రమణయ్య, ఇమాం, వేమన, సురేష్‌, కుంటిమద్ధి ఓబులేసు, ఐఎంఎం బాషా, సుగమంచి శ్రీనివాసులు, శిరిషాల అంజి, హరినాథరెడ్డి, వసంతకుమార్‌, రాజేష్‌, హనుమంతు, కృష్ణారెడ్డి, వెంకటేష్‌, విశ్వనాథ్‌, ముసలయ్య, ముత్యాలమ్మ, శాంతమ్మ, నారాయణస్వామి, ఓబులేసు, సూర్యనారాయణ, ఆది, రామాంజనేయులు, నాగముని, హనుమంతు, మారెన్న, తదితరులు పాల్గొన్నారు.

ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయిస్తామన్న మంత్రి లోకేష్‌ ఎక్కడ?

ఆర్‌డీటీపై మంత్రులు, ఎంపీలు కపటప్రేమ వీడాలి

అఖిలపక్ష కమిటీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement