ఆటో బోల్తా.. ఒకరి మృతి
రాయదుర్గంటౌన్: మండల పరిధిలోని భూపసముద్రం వద్ద అనంతపురం ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు చనిపోయాగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కర్ణాటకలోని నాయకనహట్టి పంచాయితీ పరిధిలోని మల్లూరహళ్లి గ్రామవాసులు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మల్లూరుహళ్లి గ్రామం నుంచి డీజల్ ఆటోలో రాయదుర్గం మండలం జుంజుంరాపల్లి గ్రామంలోని చిత్రకొండపై వెలసిన అరుడ మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయల్దేరారు. అయితే భూపసముద్రం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌కు సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఉచ్చప్ప (50) మృతి చెందారు. అలాగే రమేష్ (6) తీవ్ర రక్తగాయాలు కాగా సంగీత (22)కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రమేష్ కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైదులు సిఫార్సు చేయడంతో క్షతగాత్రులను కర్ణాటకలోని చిత్రదుర్గంకు తరలించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు.
గాయపడిన బాలుడు రమేష్, మృతుడు ఉచ్చప్ప
ఇద్దరికి గాయాలు
ఆటో బోల్తా.. ఒకరి మృతి


