తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’ | - | Sakshi
Sakshi News home page

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

Feb 16 2026 7:26 AM | Updated on Feb 16 2026 7:26 AM

తప్పు

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

మోసపూరిత బడ్జెట్‌

సీఎం చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసలేదు. అబద్ధపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తోంది. సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500, యువతకు నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేకపోవడం సిగ్గుచేటు. పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌ బకాయిల చెల్లింపులకు అరకొరగా నిధులు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతోంది. అన్నదాతను ఆదుకునే ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదని బడ్జెట్‌ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఉద్యోగులకు సంబంధించి ఐఆర్‌, వేతన సవరణ, పెండింగ్‌ బకాయిల నిధుల గురించి ప్రస్తావించకుండా వారిని కూడా మోసం చేశారు. – వై.వెంకటరామిరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే

యువతను దగా చేస్తున్న ప్రభుత్వం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం యువతను దగా చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం... జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకపోవడం మోసానికి పరాకాష్ట. ఎన్నికల సమయంలో యువతకు స్పష్టమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేకుండా మోసం చేస్తున్నారు. ఏటా జనవరి 1న జాబ్‌క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత కోచింగ్‌ కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. – సంతోష్‌ , ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి

కడుపునొప్పి తాళలేక

యువకుడి ఆత్మహత్య

గుంతకల్లు రూరల్‌: కడుపునొప్పి తాళలేక ఇర్ఫాన్‌ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం గుంతకల్లులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు .. స్థానిక కసాపురం రోడ్డులో అయ్యప్పస్వామి దేవాలయం ముందు భాగంలో నివాసం ఉంటున్న రహిమాన్‌, ఖాశీంబీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు హోటల్‌ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు కియాలో పని చేస్తుండగా చిన్న కుమారుడైన ఇర్ఫాన్‌ ఇంటర్‌ ఫెయిల్‌ కావడంతో రెండేళ్లుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 13న రహిమాన్‌, ఖాశీంబీ తమ బంధువుల ఇంటికి కర్నూలుకు వెళ్లి శనివారం అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి బయట నుంచి ఎంత పిలిచినా కుమారుడు తలుపు తీయలేదు. అనుమానం కలిగిన తల్లిదండ్రులు తలుపు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా కుమారుడు ఉరి తాడుకు వేళాడుతూ విగత జీవిగా కనిపించాడు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కసాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అనంతపురం క్రైం: ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే చాలు కాగిత రహిత పాలన అంటూ ఊదర కొడుతుంటారు. అయితే ఆయన మాటలకు చేతలకు ఏం సంబంధం ఉండదని ఎన్నోసార్లు రుజువైంది. కమిషనర్‌, డ్రైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) డ్యాష్‌బోర్డ్‌ కూడా దాన్నే స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను ఎప్పటికప్పుడు డ్యాష్‌ బోర్డులో అందుబాటులో ఉంచాలి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ సమగ్రంగా పొందుపరిచేవారు. సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చాక, ఈ పరిస్థితి మరింత మెరుగ్గా సాగింది. అయితే కూటమి ప్రభుత్వంలో డ్యాష్‌ బోర్డు తప్పుల తడకగా మారింది.

సిబ్బంది ఉన్నా హాజరు శాతం సున్నా...

డ్యాష్‌బోర్డ్‌లో నమోదువుతున్న యూఎల్‌బీ హాజరు గణాంకాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో శానిటేషన్‌ విభాగం పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అనంతపురం నగరంలో శానిటేషన్‌ విభాగంలో మొత్తం 586 మంది సిబ్బంది ఉండగా హాజరులో 0 శాతంగా చూపించారు. ఇందులో 450 మంది పీహెచ్‌ వర్కర్లు, 35 మంది డ్రైవర్లు, 60 మంది లోడర్లు, 41 మంది సూపర్‌ వైజర్లు ఉన్నారు. గుత్తి 92 మంది, గుంతకల్‌ 200 మంది, కళ్యాణదుర్గం 57 మంది, రాయదుర్గం 128 మంది, తాడిపత్రి 172 మంది ఉన్నా జీరో శాతంగా నమోదైంది. ఇదే పరిస్థితే శ్రీసత్యసాయి జిల్లాలోనూ కనిపిస్తోంది. ధర్మవరం 198 మంది, హిందూపురం 314 మంది, కదిరి 175 మంది, మడకశిర 29 మంది, పుట్టపర్తి 62 మంది ఉన్నా సిబ్బంది హాజరు శాతం సున్నాగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే..

వందలాది మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ హాజరు నమోదు లేకపోవడం శానిటేషన్‌ సేవలు స్తంభించాయా లేక అటెండెన్స్‌ నమోదు చేయలేదా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఈ గణాంకాలు పూర్తిస్థాయిలో అప్‌డేట్‌ కాలేదని భావించినా కార్యాలయాల్లో ఏరోజుకారోజు నమోదు చేయాల్సిన సిబ్బంది హాజరు వివరాలపై నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బయోమెట్రిక్‌ లేదా ఆ్‌లైన్‌ అటెండెన్స్‌ వ్యవస్థ సక్రమంగా పర్యవేక్షించకపోవడం, స్థానిక స్థాయిలో అధికారులు రోజువారీ సమీక్షలు చేయకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నారు.

కీలక సేవలపై ప్రతికూల ప్రభావం

శానిటేషన్‌ సిబ్బంది హాజరును సున్నాగా చూపబడటంతో చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ వంటి కీలక సేవలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దోమల వ్యాప్తి, చెత్త పేరుకుపోవడం, సంక్రమణ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల సీడీఎంఏ స్థాయిలోనే తక్షణ సమీక్ష నిర్వహించి, రోజువారీ హాజరు నమోదు తప్పనిసరి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరం. డ్యాష్‌బోర్డ్‌లోని గణాంకాలు కేవలం సంఖ్యలు కాకుండా పట్టణ శుభ్రత వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్న హెచ్చరిక సంకేతాలుగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నిండు ప్రాణాన్ని బలిగొన్న యూటర్న్‌

పోటాపోటీగా రాతి దూలం పోటీలు

సీడీఎంఏ డ్యాష్‌బోర్డులో శానిటేషన్‌ సిబ్బంది హాజరు చూపని అధికారులు

కీలక సేవలపై ప్రతికూల ప్రభావం

పట్టించుకోని ఉన్నతాధికారులు

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’ 1
1/4

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’ 2
2/4

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’ 3
3/4

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’ 4
4/4

తప్పుల తడకగా ‘డ్యాష్‌ బోర్డు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement