ప్రేమ మాటలకు, అక్షరాలకు అందని మధురమైన, అపురూపమైన భావన. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా, రెండు మనసుల మధ్య ఏర్పడే బంధం. ఎంత వర్ణించినా తక్కువయ్యే ఈ భావోద్వేగానికీ ఓ ప్రత్యేక రోజు ఉంది. అదే ‘వాలెంటైన్స్‌ డే’. ఆ రోజు రానే వచ్చింది. రప్రేమను వ్యతిరేకిస | - | Sakshi
Sakshi News home page

ప్రేమ మాటలకు, అక్షరాలకు అందని మధురమైన, అపురూపమైన భావన. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా, రెండు మనసుల మధ్య ఏర్పడే బంధం. ఎంత వర్ణించినా తక్కువయ్యే ఈ భావోద్వేగానికీ ఓ ప్రత్యేక రోజు ఉంది. అదే ‘వాలెంటైన్స్‌ డే’. ఆ రోజు రానే వచ్చింది. రప్రేమను వ్యతిరేకిస

Feb 14 2026 7:53 AM | Updated on Feb 14 2026 7:53 AM

ప్రేమ మాటలకు, అక్షరాలకు అందని మధురమైన, అపురూపమైన భావన.

ప్రేమ మాటలకు, అక్షరాలకు అందని మధురమైన, అపురూపమైన భావన.

అనంతపురం కల్చరల్‌: ప్రేమలో ఉండే వారికి ప్రతిరోజూ పండగలాగే అనిపిస్తుంది. అయితే ఫిబ్రవరి 14న వచ్చే వాలెంటైన్స్‌ డే మాత్రం ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్రేమికులు ఈ వాలెంటైన్స్‌ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సమయంలో తమ భాగస్వామికి తమ ప్రేమను ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటారు. పేమికుల రోజు సందర్భంగా శనివారం అనంతపురంలోని కొన్ని రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు.

ప్రేమను మించిన ఆయుధం లేదు

వాలెంటైన్‌ డే కు సంబంధించి ఓ చారిత్రక ఘట్టమూ లేకపోలేదు. క్రీస్తు శకం 270లో వివాహ వ్యవస్థపై ఏ మాత్రం ఇష్టం లేని రోమ్‌ నగరాన్ని పాలించే రాజు క్లాడియస్‌ అప్పటికే వివాహంపై నిషేధం విధించారు. తన ముందు ఎవరైనా పెళ్లి ప్రస్తావన తీసుకెళితే కఠినమైన శిక్షలు వేసేవారు. అదే సమయంలో ప్రేమ పెళ్లిళ్లను మతగురువు వాలెంటైన్‌ విపరీతంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. హింస, స్వార్థం, ద్వేషం వంటి చెడు గుణాలపై పోరాడేందుకు ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మిన ఆయన.. ప్రేమలో పడిన వారికి దగ్గరుండి వివాహం జరిపించేవారు. తన రాజ్యంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీసిన రోమ్‌ రాజు.. వాలెంటైన్‌ ప్రేమ పాఠాల గురించి తెలుసుకుని అతనిని కారాగారంలో బంధించాడు. రాజద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. అయితే కారాగారంలో శిక్ష అనుభవించే సమయంలో జైలర్‌ కూతురితో వాలెంటైన్‌ ప్రేమలో పడిపోయాడు. తనను ఉరి తీసే ముందు తన ప్రేయసి గురించే తలచుకుంటూ ‘యువర్‌ వాలెంటైన్‌’ అంటూ ఓ ప్రేమ లేఖ రాశాడు. అలా అది కాస్త ప్రేమకు నిర్వచనంగా మారి ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సందర్భం నేడు ‘వాలెంటైన్స్‌ డే’

Advertisement
 
Advertisement
Advertisement