విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కృషి
బుక్కరాయసముద్రం: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. మంగళవారం సాయంత్రం కొర్రపాడు ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు చదువులతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. 19 ఏళ్లలోపు వయసున్న పిల్లలందరికీ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్–400ఎంజీ మాత్రలను నమిలి మింగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి, ఐసీడీఎస్ పీడీ అరుణ కుమారి, ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్, ఆర్‌బీఎస్‌కే పీఓ విష్ణుమూర్తి, తహసీల్దార్ శ్రీధర్‌మూర్తి, ఎంపీడీఓ సాల్మన్ రాజు, ఎంఈఓ లింగానాయక్, ఎంపీపీ సునీత పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
శింగనమల: కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు సక్రమంగా అందించాలని కలెక్టర్ ఆనంద్ వైద్యులకు సూచించారు. మంగళవారం శింగనమల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కేజీబీవీని ఆయన తనిఖీ చేశారు.


