ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Feb 22 2026 8:06 AM | Updated on Feb 22 2026 8:06 AM

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ వార్షిక పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. సోమవారం ప్రారంభమై మార్చి 24 వరకు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 48,146 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్‌ 22,366 మంది, ఒకేషనల్‌ 2,202 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌ 21,613 మంది, ఒకేషనల్‌ 1,965 మంది రాయనున్నారు. 64 మంది చీప్‌ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 14 మంది కస్టోడియన్లు, రెండు ఫ్లయింగ్‌స్వాడ్‌ బృందాలు, నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలతో పాటు 1,051 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 64 కేంద్రాల్లో 917 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఆర్‌ఐఓ కార్యాలయం, కలెక్టరేట్‌, గుంటూరులోని ఇంటర్‌ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేశారు. నేరుగా వారు జిల్లాలో ఏ కేంద్రాన్నయినా సీసీ కెమెరాలో పరిశీలించవచ్చు.

రేపటి నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement