బురదలో కూరుకుపోయి చిరుత మృతి
రాయదుర్గం టౌన్: స్థానిక వేంకరటరమణస్వామి ఆలయ సమీపంలోని కొండపై ఉన్న ఏనుగుల బావిలో శుక్రవారం తెల్లవారుజామున ఓ చిరుత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి, రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడు, డిప్యూటీ రేంజర్ దామోదర్‌రెడ్డి, పశు వైద్యాధికారి సూర్యనారాయణరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. చిరుత కళేబరాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం బొందనకల్లు అటవీ క్షేత్రానికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం శరీర భాగాలు సక్రమంగా ఉన్నాయని, ఎలాంటి గాయాలు లేవని నిర్ధారణ అయింది. దాహం వేసిన చిరుత బావిలో నీరు తాగేందుకు వెళ్లి బురదలో కూరుకుపోయి మృతి చెందినట్లుగా డీఎఫ్‌ఓ తెలిపారు.


