కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
తాడిపత్రి రూరల్: కంది, పప్పుశనగ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు సోమవారం తాడిపత్రి మార్కెట్ యార్డు వద్ద ఆందోళన చేశారు. రైతు సంఘం నాయకులు, రైతులు మాట్లాడుతూ దళారులు తక్కువ ధరకే పంట కొనుగోలు చేస్తూ దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే మద్దతు ధరతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మార్కెట్ యార్డు అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి రాజారామిరెడ్డి, అధ్యక్షుడు నాగరాజు, జిల్లా కమిటీ సభ్యుడు వెంకటేష్, రైతులు జయశంకర్‌రెడ్డి, కులశేఖర్‌రెడ్డి, వెంకటరమణ, మల్లికార్జునరెడ్డి, రాజేశ్వరనాయుడు, సాయినాథ్‌రెడ్డి, వెంకటప్రసాద్‌నాయుడు, చౌడయ్య, రామలింగం పాల్గొన్నారు.


