ఆడబిడ్డ నిధి ఊసే లేదు
ఆడ బిడ్డల ఆశలను చంద్రబాబు సర్కారు వమ్ము చేస్తోంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీనిచ్చారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్నా ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించకుండా మహిళలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది.
– స్రవంతి, గృహిణి, కణేకల్లు
విద్యా రంగానికి అన్యాయం
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి సరియైన కేటాయింపులు లేవు. అంకెల గారడీతో మోసం చేశారు. పాఠశాల విద్యా రంగానికి రూ.32,308 కోట్లు మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 0.14 శాతం తక్కువ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేవలం రూ.1,500 కోట్లు, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి గత బడ్జెట్‌లో కంటే తక్కువ నిధులు కేటాయించారు. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్‌తో విద్యా రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశారు.
– నవీన్ యాదవ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి, గుత్తి


