ఇద్దరు మైనర్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు మైనర్ల అరెస్ట్‌

Feb 10 2026 7:32 AM | Updated on Feb 10 2026 7:32 AM

ఇద్దర

ఇద్దరు మైనర్ల అరెస్ట్‌

కణేకల్లు: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం కణేకల్లు పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్‌ఐ నాగమధు వెల్లడించారు. కణేకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు తమ తల్లిదండ్రులతో కలసి కూలి పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన బాలురు తమ అవసరాలు తీర్చుకునేందుకు దొంగతనాలకు తెరలేపారు. చాకలి రామన్న ఇంట్లో చొరబడి 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ.వెయ్యి నగదు, బెస్త వన్నూరుస్వామి ఇంట్లో రూ.10వేల నగదు, జెడ్పీహెచ్‌ఎస్‌లో నీటి పంపింగ్‌ మోటారు, నల్లంపల్లి గ్రామ శివారున ఉన్న మరో ఇంట్లో విద్యుత్‌ మోటార్‌ను అపహరించారు. ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కళ్యాణదుర్గం–బళ్లారి రహదారిలో వెళుతున్న బాలురు తమ వద్ద ఉన్న డబ్బు పంచుకునే విషయంగా గొడవపడడంతో అనుమానం వచ్చిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుని పాలిథిన్‌ సంచుల్లోని రెండు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చోరీలను అంగీకరించడంతో ఇరువురినీ గ్రామపెద్దల సమక్షంలో అరెస్ట్‌ చేశారు.

ఉపాధి నూతన చట్టాన్ని రద్దు చేయాలి : సీపీఐ

అనంతపురం టౌన్‌: ఉపాధి హామీ చట్టానికి పేరు మార్చి నూతనంగా తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ సాధనలో భాగంగా సోమవారం డ్వామా కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వీ–బీ–జీ రామ్‌జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ.. వెంటనే కొత్తచట్టాన్ని రద్దుచేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, నాయకులు రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు మైనర్ల అరెస్ట్‌ 1
1/1

ఇద్దరు మైనర్ల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement