త్వరలో ఓటర్ మ్యాపింగ్‌పై శిక్షణ
అనంతపురం అర్బన్: త్వరలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అందుకు సంబంధించి ఓటరు మ్యాపింగ్ అంశంపై బీఎల్‌ఓలు, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తామని డీఆర్‌ఓ ఎ.మలోల తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు, తొలగింపు, వివరాల మార్పు క్లెయిమ్‌లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. రాజకీయ పార్టీలు చొరవ తీసుకుని యువత ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.


