బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో శుక్రవారం బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన బీటెక్ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, రెండో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, బీసీఏ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–24)రెగ్యులర్, బీబీఏ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (24) రెగ్యులర్, బీబీఏ ఒకటో సంవత్సరం ఒకటో సెమిస్టర్ రెండో సెమిస్టర్ (24) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ శారద, డాక్టర్ ఎస్. శ్రీధర్ విడుదల చేశారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.
ముగిసిన ఏపీపీఎస్‌సీ పరీక్షలు
అనంతపురం అర్బన్: ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈ నెల 9న ప్రారంభమైన పరీక్షలు శుక్రవారం ముగిశాయి. జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన జవాబు పత్రాలను డీఆర్‌ఓ మలోల పర్యవేక్షణలో ప్రత్యేక బస్సులో పోలీసు బందోబస్తు ద్వారా విజయవాడకు తరలించారు. కార్యక్రమంలో ఏఓ అలెగ్జాండర్, ఏపీపీఎస్‌సీ అధికారులు పాల్గొన్నారు.
పిల్లల ఆరోగ్యమూ ప్రధానమే
అనంతపురం అర్బన్: పిల్లలకు విద్యతో పాటు వారి ఆరోగ్యమూ ప్రధానమేనని కలెక్టర్ ఆనంద్ ఆన్నారు. ఈ నెల 17న చేపట్టనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17న అన్ని విద్యాసంస్థల్లో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య, విద్యా, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు రాక
అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు అనంతపురం చేరుకోనున్నారు. ఆదర్శనగర్‌లోని మారెమ్మ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆత్మకూరు మండలం మదిగుబ్బ తండాకు 11 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అనంతపురం రూరల్ మండలం కురుగుంట సేవాలాల్‌కాలనీలో పర్యటిస్తారు. 2 గంటలకు కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఎస్టీ సంఘాల నాయకులతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 6 గంటలకు గుత్తి మండలం సేవాఘడ్‌కు వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళతారు.
బీటెక్ ఫలితాల విడుదల


