రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక పాలన

Feb 13 2026 3:13 AM | Updated on Feb 13 2026 3:13 AM

రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక పాలన

రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక పాలన

ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు

జక్కుల మాధవ్‌

అనంతపురం అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక పాలన సాగిస్తోందని ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్‌ విమర్శించారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్‌తో పాటు జిల్లా కార్యదర్శి రవికుమార్‌, ప్రభుత్వ పెన్షనీర్ల సంఘం జిల్లా కార్యదర్శి శిల జయరామప్ప, నగర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రెండేళ్లవుతున్నా సమస్యలు పరిష్కరించలేదన్నారు. బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు. తక్షణం 12వ పీఆర్‌సీ నియమించడంతో పాటు మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ (ఓపీఎస్‌) విధానం అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింజేయాలన్నారు. సుప్రీం కోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీఎన్‌జీజీఓ నిరసనకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌డీ నాయుడు, నగర అధ్యక్షుడు వెంకటనారాయణ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీధర్‌బాబు, చంద్రమోహన్‌, నాయకులు జమీలబేగం, లక్ష్మినారాయణ, లింగమేష్‌, దస్తగిరి, లక్ష్మినరసయ్య, వెంకటరాముడు, ప్రవీణ్‌, ప్రవీణ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement