భూముల రీ–సర్వే ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సర్వే చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నా.. అందుకు తగ్గ సహకారం తక్కువగా ఉందనేది ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వేలో కీలకమైన రోవర్లు చెడిపోతే మరమ్మతు చేసివ్వలేదు. ఇక సర్వేకు సంబం | - | Sakshi
Sakshi News home page

భూముల రీ–సర్వే ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సర్వే చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నా.. అందుకు తగ్గ సహకారం తక్కువగా ఉందనేది ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సర్వేలో కీలకమైన రోవర్లు చెడిపోతే మరమ్మతు చేసివ్వలేదు. ఇక సర్వేకు సంబం

Feb 7 2026 9:53 AM | Updated on Feb 7 2026 9:53 AM

భూముల

భూముల రీ–సర్వే ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సర్

అనంతపురం అర్బన్‌: భూ సమస్యల పరిష్కారానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపట్టింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సర్వే పక్కాగా చేపట్టేందుకు అవసరమైన వనరులు, సిబ్బంది, పరికరాలను అందుబాటులో ఉంచింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత ప్రభుత్వానికి వడ్డించిన విస్తరిని ముందుంచింది. అయినా పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించలేని పరిస్థితి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో నెలకొంది. జిల్లాలో 503 రెవెన్యూ గ్రామాల్లో 25,17,658.51 ఎకరాలు సర్వే చేయాల్సి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని గ్రామాలో డ్రోన్‌ఫైల్‌, ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌ పూర్తి చేసింది. 198 గ్రామాల్లో 5,88,615.62 ఎకరాలు సర్వే పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పటిష్ట వ్యవస్థతో 2024 డిసెంబరులో రీ–సర్వేని పునఃప్రారంభించింది. మిగిలిన 305 గ్రామాల్లో తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా 31 గ్రామాల్లో సర్వే చేసింది. ఇక రెండవ విడతలో 24 గ్రామాలు, మూడవ విడతలో 24 గ్రామాల్లో మొత్తం 79 గ్రామాల్లో సర్వే చేసింది. నాల్గవ విడతగా 90 గ్రామాల్లో ప్రస్తుతం సర్వే చేపట్టంది.మిగిలిన 136 గ్రామాల్లో మలి విడతల్లో సర్వే చేయాల్సి ఉంది.

రోవర్ల రిపేరీ పట్టదా..?

రీ–సర్వే కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లావ్యాప్తంగా 158 రోవర్లను అందుబాటులో ఉంచి సర్వేయర్లకు శిక్షణ ఇచ్చింది. గ్రామాల్లో రీ–సర్వే కోసం 131 రోవర్లను వినియోగించారు. అయితే ఈ రోవర్లలో ప్రస్తుతం 52 చెడిపోగా 79 మాత్రమే పనిచేస్తున్నాయి. సర్వే వేగవంతంగా జరగాలంటే 131 రోవర్లను వినియోగించాల్సి ఉంటుంది. చెడిపోయిన 52 రోవర్లను మరమ్మతు కోసం పంపి రెండు నెలలు అవుతున్నా వాటిని తిరిగి పంపలేదు. దీంతో ఉన్న రోవర్లతో సర్దుబాటు చేసుకుంటూ సర్వే ప్రక్రియను నెట్టుకొచ్చే పరిస్థితి నెలకొంది. ఇక ల్యాప్‌టాప్‌ల సమస్య కూడా వేధిస్తోంది. ప్రస్తుతం 50 ల్యాప్‌టాప్‌లు వినియోగిస్తున్నారు. ఒక గ్రామంలో సర్వే వివరాలు నమోదు చేయాలంటే కనీసం మూడు ల్యాప్‌ట్యాప్‌లు ఉండాలని సర్వే శాఖ సిబ్బంది చెబుతున్నారు. అవసరమైన మేరకు ల్యాప్‌టాప్‌లను ప్రభుత్వం అందుబాటులో ఉంచకపోవడంతో ఉన్నవాటితో పని జరిగే క్రమంలో తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని పలువురు సర్వేయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సర్వేయర్ల సహాయ నిరాకరణ

గ్రామ సర్వేయర్లు 460 మంది ఉన్నారు. వీరంతా రీ–సర్వే ప్రక్రియలో పాల్గొంటున్నారు. డిమాండ్ల సాధన కోసం ప్రస్తుతం వీరంతా సహాయ నిరాకరణ బాట పట్టి జనవరి 27 నుంచి రీ–సర్వే దూరంగా ఉన్నారు. సర్వేకు అవసరమైన ల్యాప్‌ట్యాప్‌లు, రోవర్లు, ఇతర స్టేషనరీ సరఫరా చేయాలని, పెడింగ్‌ టీఏ, డీఏ, ఇతర బకాయిలు చెల్లించాలని, బేసిక్‌ పే రూ.32 వేలు మంజూరు చేయాలని, జిల్లా వారీగా 70 శాతం గ్రేడ్‌–1 పదోన్నతి ఇవ్వాలని, సాంకేతిక పనులు నిర్వహిస్తున్నందున టెక్నికల్‌ పే అలవెన్స కల్పించాలని, రేషనలైజేషన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4,722 మంది గ్రామ సర్వేయర్లను మిగిలిన శాఖల్లో విలీనం చేయాలని, సచివాలయ ఇతర ఉద్యోగులకు వర్తింపజేస్తున్న ప్రయోజనాలన్నీ గ్రామ సర్వేయర్లకూ వర్తింపజేయాలని ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచారు.

ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువ.. సహకారం తక్కువ

రోవర్ల రిపేరీపై దృష్టి సారించని సర్కార్‌

సరిపడు ల్యాప్‌టాప్‌లూ ఇవ్వని వైనం

భూముల రీ–సర్వే ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సర్1
1/1

భూముల రీ–సర్వే ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. సర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement