రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం చంద్రబాబుకు మొదటి నుంచీ అలవాటే. ఏపీ ప్రజల హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను తెలంగాణ తరలించుకుపోతున్నా చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సీమకు సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఎందుకు లాలూచీ పడుతున్నారు? ఈ ప్రాంత రైతులు తీవ్రంగా ఇబ్బంది పడతారని తెలిసినా ఎందుకు పట్టించుకోవడం లేదు? సీమ ప్రాజెక్టులపై ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతాం.
– అనంత వెంకటరామిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు


