కారు ఢీ కొని వ్యక్తి మృతి
పెద్దవడుగూరు: మండల పరిధిలోని మిడుతూరు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో షేక్షావలి (37) మృతి చెందాడు. పోలీసుల వివరాలమేరకు.. గుత్తి పట్టణానికి చెందిన షెక్షావలి లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మిడుతూరు వద్ద నాగరాజు పంక్షర్ షాపు వద్ద ఆగి రోడ్డుకు అవతలి వైపు ఉన్న ముత్యాలరెడ్డి హోటల్ వద్ద టీ తాగడానికి వెళ్లాడు. తిరిగి రోడ్డు దాటుతుండగా గుత్తి వైపు నుంచి అనంతపురం వైపు వెళ్తున్న కారు ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన షెక్షావలి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మృతుడు షెక్షావలి


