అర్హులందరికీ అక్రిడిటేషన్లు
అనంతపురం అర్బన్: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ ఇస్తామని అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. జిల్లాలో తొలి విడతగా 551 మందికి అక్రిడిటేషన్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అక్రిడిటేషన్ మెంబర్ కన్వీనర్ డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అర్హత ఉన్న వారందరికీ అక్రిడిటేషన్ మంజూరు చేయాలని కోరారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా పత్రికలు, పీరియాడికల్స్‌ను డీఐపీఆర్‌ఓ కార్యాలయానికి అందించే వారికి, ఎలాంటి తప్పులు చేయని వారికి నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ మంజూరు చేస్తామన్నారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కమిటీ సభ్యులు షఫీవుల్లా, అయూఫ్, రవికుమార్, ప్రతాప్, అనిల్‌కుమార్‌రెడ్డి, మల్లికార్జునరావు, రామకృష్ణ, సురేష్‌బాబు, చంద్రశేఖర్, రసూల్, రామాంజనేయులు, ప్రసాద్, ఏపీఆర్‌ఓ ఫకృద్ధీన్, పీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, సిబ్బంది దామోదర్‌రెడ్డి, కమల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


