మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభం
అనంతపురం: స్థానిక సప్తగిరి సర్కిల్ సమీపంలోని సుభాష్‌రోడ్డులో బుధవారం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యజమానులు మాట్లాడుతూ రిటైల్ ఫార్మాట్‌లు, విస్తృత శ్రేణి కలెక్షన్లు, మెరుగైన కస్టమర్ అనుభవం ద్వారా కీలకమైన ప్రాంతీయ మార్కెట్‌లలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నామన్నారు. సంప్రదాయలు, వివాహాభరణాలకు పెరుగుతున్న డిమాండ్‌కనుగుణంగా నమ్మకం, పారదర్శకత, కస్టమర్ల నమ్మకాన్ని పెంపొందించుకుని రాయలసీమలోనే పెద్ద జ్యువెలరీ మాల్‌గా గుర్తింపు దక్కించుకుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మలబార్ గోల్డ్ హెడ్ రిటైల్ ఆపరేషన్స్ ఆఫ్ ఇండియా సిరాజ్ పికే, జోనల్ హెడ్ (సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ) నిఖిల్ చంద్రన్, మహమద్మ్ షరీజ్ (హైదరాబాద్ జోనల్ హెడ్), షానిబ్ (తెలంగాణ జోన్ హెడ్), హఫీజ్ మహమ్మద్ (డిప్యూటీ షోరూం హెడ్, అనంతపురం), తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే స్కూళ్ల అభివృద్ధి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘విద్యాంజలి’లో జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. బుధవారం బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు రీజియన్ ట్రైనింగ్ సెంటర్‌లో విద్యాంజలి కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సీఎంఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యాంజలి పోర్టల్ అనేది ప్రభుత్వ పాఠశాలలు, దాతలకు మధ్య వారధిగా పనిచేస్తుందన్నారు. పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సంబంధిత సేవలకు సంబంధించి దాదాపు 100కు పైగా అంశాలను పోర్టల్‌లో ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. తద్వారా దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు నేరుగా పాఠశాలలకు సాయం చేసే అవకాశం ఉందని చెప్పారు. కంబదూరు ఎంఈఓ, మాస్టర్ ట్రైనర్ మదన్ మోహన్ మాట్లాడుతూ కొంతమంది మోసగాళ్లు ‘విద్యాంజలి’ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు చూస్తున్నామని, ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు. అసిస్టెంట్ ఏఎంఓ ఫణిరాజు మాట్లాడుతూ విద్యాంజలి అనేది పూర్తిగా స్వచ్ఛంద సేవతో కూడిన కార్యక్రమం అన్నారు. మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించిన గోవర్ధన్, రంగనాయకులు ‘విద్యాంజలి’ పోర్టల్ సాంకేతిక అంశాలను వివరించారు.
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభం


