గంగమ్మా.. చల్లగ చూడమ్మా..!
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం సమీపంలోని పెన్నానది తీరాన వెలసిన ఏటి గంగమ్మ తిరునాళ్లు ఆదివారం వైభవంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మాఘమాసం మూడో ఆదివారం జరిగే ఈ తిరునాళ్లకు ఈసారి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పెన్నానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులను తీర్చుకున్నారు. ఉదయం అమ్మవారి మూలవిరాట్‌ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆంధ్రా, కర్ణాటక నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని, బోనాలు సమర్పించారు.
గంగమ్మా.. చల్లగ చూడమ్మా..!


