కోర్టు భవనం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

కోర్టు భవనం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

Feb 9 2026 7:36 AM | Updated on Feb 9 2026 7:36 AM

కోర్టు భవనం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

కోర్టు భవనం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

ఉరవకొండ: ఓ కేసు విషయంలో తనకు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ ఓ వ్యక్తి కోర్టు భవనం పైకెక్కి కిందకు దూకుతానంటూ కలకలం సృష్టించాడు. న్యాయమూర్తి అక్కడికి చేరుకుని తనకు హామీనిస్తే తప్ప కిందకు దిగనంటూ భీష్మించాడు. ఈ ఘటనతో కోర్టు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సదరు వ్యక్తిని ఉరవకొండకు చెందిన రాజశేఖర్‌గా గుర్తించి, సముదాయించి కిందకు దించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంగా పోలీసులు మాట్లాడుతూ.. రాజశేఖర్‌ మానసిక స్థితి సరిగా లేదని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం గొంతు కోసుకుని చికిత్సకు సహకరించకుండా ఆస్పత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement