కలెక్టరేట్‌లో ‘అవినీతి’ అనకొండ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ‘అవినీతి’ అనకొండ

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

కలెక్టరేట్‌లో ‘అవినీతి’ అనకొండ

కలెక్టరేట్‌లో ‘అవినీతి’ అనకొండ

వ్యవసాయ భూమి ఫైలు క్లియర్‌ చేయిస్తానని బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి వద్ద తొలి విడతగా రూ.25 వేలు వసూలు చేశాడు. పని ఎప్పుడు చేస్తారంటూ వాళ్లు తిరుగుతున్నారు.

భూమి ఫైలు క్లియరెన్స్‌ కోసం యాడికి మండలం కంబాలపాడుకు చెందిన ఒక వ్యక్తి నుంచి మధ్యవర్తి ద్వారా రూ.30 వేలు వసూలు చేశాడు. పని చేయించు లేదా డబ్బులైన వెనక్కు ఇవ్వు అంటూ మధ్యవర్తి కలెక్టరేట్‌కు తిరుగుతున్నాడు. ఆ ఉద్యోగి అవినీతికి సంబంధించి ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలాంటివి చాలానే ఉన్నాయి.

భూమి ఫైలు క్లియర్‌ చేయిస్తానని మదనపల్లికి చెందిన ఒక మహిళ వద్ద అనంతపురం కలెక్టరేట్‌లో పనిచేసే ఓ ఉద్యోగి రూ.2 లక్షలు వసూలు చేశాడు. ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయాన బంధువు. అయితే పని చేయించడంలో జాప్యం చేస్తూ వస్తున్నాడు. తన పనిచేయించకపోతే నేరుగా సీఎం వద్దకు వెళతానని ఆమె హెచ్చరించినట్లు సమాచారం.

అనంతపురం అర్బన్‌: కలెక్టర్‌ కార్యాలయంలో ఓ అధికారి వద్ద సీసీగా వ్యవహరిస్తున్న ఉద్యోగి అవినీతి తారస్థాయికి చేరింది. అతను ‘అవినీతి అనకొండ’ అంటూ కార్యాలయ సిబ్బందిలో చర్చ సాగుతోంది. ఆ అధికారి వద్ద అంతా తానై వ్యవహరిస్తుంటాడనే విమర్శలు ఉన్నాయి. భూముల ఫైళ్లు క్లియర్‌ చేయిస్తానంటూ పలువురి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బహిరంగంగానే వినవస్తున్నాయి. ఫైలు స్థాయిని బట్టి రూ.25 వేల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తాడని సమాచారం. ఫైలు క్లియర్‌ కావాలంటే అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువు నుంచే డబ్బు వసూలు చేశాడంటే ఆ ఉద్యోగి ఎంతటి ఘనుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

గతంలోనూ ఆరోపణలు

అవినీతి ఉద్యోగిపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. జాయింట్‌ కలెక్టర్‌గా నిశాంత్‌ కుమార్‌ ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తానని ఒక ఉద్యోగి వద్ద నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఒక మహిళా హోంగార్డ్‌ కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇలా ఆ ఉద్యోగి అవినీతి వ్యవహారాలు చాలానే ఆరోపణలు ఉన్నాయి.

అధికారికి శిష్యుడే...

సదరు ఉద్యోగి డిప్యుటేషన్‌పై కలెక్టరేట్‌లో అధికారి వద్ద సీసీగా చేరాడు. ఉద్యోగపరంగా అధికారికి ఆ ఉద్యోగి శిష్యుడు అని కార్యాలయ సిబ్బంది చెబుతుంటారు. ఏ ఫైలు ఎలా సిద్ధం చేయాలి అని అతనికి శిక్షణ ఇచ్చింది ఆ అధికారేనని అంటుంటారు. గురువు కూడా తక్కువేమీ కాదని... అయితే ఈ శిష్యుడు గురువును మించినవాడయ్యాడని విమర్శలున్నాయి.

భూముల ఫైళ్ల క్లియరెన్స్‌ పేరుతో దందా

ఫైలు స్థాయిని బట్టి డబ్బు వసూలు

సీఎం బంధువు నుంచి రూ.2 లక్షలు గుంజిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement