మార్చి 31లోగా పనులు పూర్తి చేయాలి
అనంతపురం టౌన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను మార్చి 31లోగా 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాషా సూచించారు. గురువారం ఏపీడీలు, ఏపీఓలతో ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో నూతన ఉపాధి చట్టం ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ వీబీ జీ రామ్ జీ’ అమల్లోకి వస్తుందన్నారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న మెటిరీయల్ పనులను 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం రూ. 90 కోట్లతో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. మరో నెల రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందన్నారు. పనుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పనులను పూర్తి చేయించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు.


