వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం
గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాంపల్లి కనుమల్లో వెలసిన పెద్ద కదిరప్పస్వామి రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. స్వామి దర్శనార్థం భారీగా భక్తులు తరలి రావడంతో వెంకటాంపల్లి కొండప్రాంతం కిటకిటలాడింది. ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆదివారం వేకువజామునే లక్ష్మీ నరసింహస్వామికి కల్యాణం నిర్వహించారు. ఉదయం పది గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 51 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. సాయంత్రం 5.30 గంటలకు అలంకరించబడిన రథంపై శ్రీలక్ష్మీ నరసింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుంచారు. రథాంగహోమం, బలి హరణ పూజల అనంతరం వేలాది భక్తుల గోవింద నామస్మరణ మధ్య స్వామి రథోత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, సోదరులు పాల్గొన్నారు.
ఘనంగా ఉచిత
సామూహిక వివాహాలు
వైభవంగా కదిరప్ప స్వామి రథోత్సవం


