అనంత మున్సిపల్‌ కమిషనర్‌గా జశ్వంతరావు | - | Sakshi
Sakshi News home page

అనంత మున్సిపల్‌ కమిషనర్‌గా జశ్వంతరావు

Feb 7 2026 9:53 AM | Updated on Feb 7 2026 9:53 AM

అనంత మున్సిపల్‌  కమిషనర్‌గా జశ్వంతరావు

అనంత మున్సిపల్‌ కమిషనర్‌గా జశ్వంతరావు

విజయనగరం మున్సిపల్‌ కమిషనర్‌గా బాలస్వామి బదిలీ

అనంతపురం క్రైం:అనంతపురం మున్సిపల్‌ కమిషనర్‌గా జశ్వంతరావు నియమితులయ్యారు. ఇప్పటివరకుకమిషనర్‌గా సేవలందించిన బి. బాలస్వామి విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీఓ విడుదల చేసింది. కమిషనర్‌ బాలస్వామి సమయస్ఫూర్తి కలిగిన అధికారిగా గుర్తింపు పొందారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అధికార పార్టీ నేతలు అనేక ఒత్తిళ్లకు గురిచేసినా ఎక్కడా తలొగ్గకుండా విధులు నిర్వర్తించారు.

●గుంతకల్లు కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. అలాగే.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్‌.నూర్‌అలీఖాన్‌ను కమలాపురం నగర పంచాయతీ కమిషనర్‌గా పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement