అక్రమ మద్యం కట్టడికి చర్యలు : ఎకై ్సజ్‌ డీసీ నాగమద్దయ్య | - | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం కట్టడికి చర్యలు : ఎకై ్సజ్‌ డీసీ నాగమద్దయ్య

Feb 7 2026 9:53 AM | Updated on Feb 7 2026 9:53 AM

అక్రమ మద్యం కట్టడికి చర్యలు : ఎకై ్సజ్‌ డీసీ నాగమద్దయ్య

అక్రమ మద్యం కట్టడికి చర్యలు : ఎకై ్సజ్‌ డీసీ నాగమద్దయ్య

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలోకి అక్రమ మద్యం చొరబడకుండా సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచాలని సంబంధిత అధికారులను ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య ఆదేశించారు. జిల్లాలోని అన్ని స్టేషన్‌లు, ఎన్‌ఫోర్సుమెంట్‌, ఈఎస్‌టీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్లతో శుక్రవారం తన చాంబర్‌లో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు సాగాలని, బెల్టు షాపులను నిర్మూలించాలని ఆదేశించారు. ఎకై ్సజ్‌ సురక్ష యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. పాత బకాయిల వసూలుకు ఆర్‌ఆర్‌ యాక్టు ఉపయోగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు, జిల్లా పొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి రామ్మోహన్‌రెడ్డి, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌లు రేవతి, శ్రీరామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement