ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

ప్రజా

ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకమని పంచాయతీరాజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం జేఎన్‌టీయూ ఆడిటోరియంలో జిల్లావ్యాప్తంగా డెప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ డెవలప్‌మెంట్‌ అధికారులతో ‘పీఆర్‌ కార్యకలాపాల’పై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సుధాకర్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 10లోగా అన్ని పంచాయతీల్లోనూ 100 శాతం పన్నుల వసూలు చేయాలన్నారు. ఏవైనా ఇబ్బందులుంటే డిప్యూటీ ఎంపీడీఓలను వెంట తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో జెడ్పీ ఇన్‌చార్జ్‌ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఇన్‌చార్జ్‌ డీపీఓ విజయకుమార్‌రెడ్డి, అనంతపురం డీడీఓ నాగశివలీల, గుంతకల్‌ డీడీఓ విజయలక్ష్మీ, కళ్యాణదుర్గం డీడీఓ నాగేశ్వరావు, డీపీఆర్సీ జిల్లా కోఆర్డినేటర్‌ సౌజన్య పాల్గొన్నారు.

అండర్‌ –14 రాష్ట్ర జట్టుకు రోహిత్‌

ఫీల్డింగ్‌ కోచ్‌గా షోయబ్‌

అనంతపురం కార్పొరేషన్‌: అండర్‌ –14 రాష్ట్ర క్రికెట్‌ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఎస్‌ మహ్మద్‌ షోయబ్‌, జట్టులో సభ్యుడిగా కే రోహిత్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్‌ సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు చైన్నెలో జరగనున్న అంతర్‌ రాష్ట్ర క్రికెట్‌ పోటీల్లో రోహిత్‌ ఆంధ్ర జట్టు సభ్యుడిగా బరిలో దిగనున్నాడు. లెఫ్టార్మ్‌ చైనమన్‌ (హిందూపురం) బౌలర్‌గా స్టేట్‌ ప్రాబబుల్స్‌ మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసుకున్నాడు. హిందూపురం ఎంజీఎం స్కూల్‌లో రోహిత్‌ విద్యనభ్యసిస్తున్నాడు. ఫీల్డింగ్‌ కోచ్‌ షోయబ్‌ ఏసీఏ లెవెల్‌ 0 క్రికెట్‌ కోచ్‌. గుంతకల్లు రైల్వే సబ్‌ సెంటర్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఇద్దరు రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించడం హర్షించదగ్గ విషయమని జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి యుగంధర్‌రెడ్డి పేర్కొన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ

బుక్కరాయసముద్రం: మండల పరిఽధిలోని సిద్దరాపురం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన విద్యార్థిని నందిని జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిందని హెచ్‌ఎం నీరజ, పీడీ నాగరాజు తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు నిర్వహించారన్నారు. అందులో నందిని అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఇటీవల డిల్లీలో జరిగిన జాతీయస్థాయి రగ్బీ పోటీల్లోనూ ప్రతిభ కనబరిచినట్లు తెలియజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించింది.

నందిని

ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం 1
1/3

ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం

ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం 2
2/3

ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం

ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం 3
3/3

ప్రజాసేవలో స్థానిక సంస్థలే కీలకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement