నేటి నుంచి గ్రామోత్సవ్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి గ్రామోత్సవ్‌

Feb 6 2026 7:43 AM | Updated on Feb 6 2026 7:43 AM

నేటి నుంచి గ్రామోత్సవ్‌

నేటి నుంచి గ్రామోత్సవ్‌

అనంతపురం అగ్రికల్చర్‌: స్థానిక సాయినగర్‌లో ఉన్న అంబేడ్కర్‌ భవన్‌ వేదికగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ‘అనంత గ్రామీణ మహోత్సవం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాబార్డు డీడీఎం అనురాధ ఒక ప్రకటనలో తెలిపారు. నాబార్డు, నేస్తం ఎన్‌జీఓ సంయుక్తంగా 6 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల్లో వివిధ జిల్లాల నుంచి నేతన్నలు, ఎస్‌హెచ్‌జీ, రైతులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత ఉత్పత్తులు, ఆభరణాలు, పనిముట్ల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. నాబార్డు ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో పాటు రూడ్‌సెట్‌, గ్రామీణ బ్యాంకు అధికారులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని నగర వాసులతో పాటు ఉమ్మడి జిల్లా రైతులు, మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నాలుగు బార్లు కేటాయింపు

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో రీ టెండర్‌ పిలిచిన వాటిలో నాలుగు బార్లకు లాటరీ ద్వారా లైసెన్స్‌లు జారీ చేశారు. గురువారం ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సచిన్‌ రహర్‌ అధ్యక్షతన ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి బి.రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ ద్వారా కేటాయింపులు చేశారు. అనంతపురంలో మూడు బార్లకు దరఖాస్తులు రాగా లాటరీ ద్వారా కేటాయించారు. గుంతకల్లులో రెండు బార్లకు దరఖాస్తులు కోరగా ఒక బార్‌కు మాత్రమే దరఖాస్తులు వచ్చాయని, మరో బార్‌కు ఒక దరఖాస్తు మాత్రమే రావడంతో అర్హత లేకపోవడంతో వాయిదా వేశామన్నారు. అలాగే రాయదుర్గం, తాడిపత్రిల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు బార్‌లకు దరఖాస్తులు రాలేదని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. గుంతకల్లు మున్సిపాలిటీలో పరిధిలో వాయిదా పడిన ఒక బార్‌కు ఒక దరఖాస్తు మాత్రమే వచ్చిందని, అర్హత లేకపోవడంతో దరఖాస్తు గడువును ఈనెల 7వరకూ పొడిగించామన్నారు.

ఉరవకొండ హౌసింగ్‌ డీఈగా వాసుదేవరెడ్డి

అనంతపురం టౌన్‌: గృహ నిర్మాణ సంస్థ ఉరవకొండ డివిజనల్‌ ఇంజనీర్‌గా వాసుదేవరెడ్డిని నియమిస్తూ ఆశాఖ ఎండీ అరుణ్‌బాబు ఉత్తర్వులను జారీ చేశారు. పులివెందుల డీఈగా పని చేస్తున్న వాసుదేవరెడ్డిని అనంతపురం జిల్లా ఉరవకొండ డీఈగా బదిలీ చేశారు. ఇక్కడ ఇన్‌చార్జ్‌ డీఈగా పని చేస్తున్న హనుమప్పను డీఈగా పదోన్నతి కల్పిస్తూ కుప్పంకు బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement