సంఘటిత పోరాటాలతో సమస్యలకు పరిష్కారం
అనంతపురం ఎడ్యుకేషన్: సమస్యలు పరిష్కారం కావాలన్నా, హక్కులు దక్కాలన్నా సంఘటిత పోరాటాలతోనే సాధ్యమవుతుందని, ఇందుకు సిద్ధంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ దూసి భానూజీరావు పిలుపునిచ్చారు. ఆదివారం అనంతపురంలోని డీఎంహెచ్‌ఓ కమిటీ హాలులో ఉమ్మడి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా జనసభ జరిగింది. ఉద్యోగుల హక్కులు, సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా భానూజీరావు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. ఉద్యోగ భద్రత లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ఈ క్రమంలో సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎం.ఈశ్వర్, ప్రధాన కార్యదర్శిగా సి.వరప్రసాద్, కోశాధికారిగా ఎం.రాజేష్‌తో పాటు 23 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ పి.గురునాథ్, వైస్ చైర్మన్లు దివాకర్‌బాబు, సుశీల, కోశాధికారి యు.అనిల్, నాయకులు బి.వరపుత్ర, షేక్ మస్తాన్, పి. లవరాజు, అమ్మినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ
రాష్ట్ర చైర్మన్ భానూజీరావు


