ముగిసిన కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు

Feb 4 2026 7:19 AM | Updated on Feb 4 2026 7:19 AM

ముగిసిన కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు

ముగిసిన కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు

బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలో కొండమీదరాయుని బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి వారికి తీర్థవాది వసంతోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి కొండమీదరాయుడిని సతీసమేతంగా హంస వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు.

విద్యార్థి డిబార్‌

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న లా మూడు సంవత్సరాల కోర్సు ఐదో సెమిస్టర్‌ పరీక్షల్లో మంగళవారం మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్‌ అయినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రొఫెసర్‌ జీవీ రమణ హెచ్చరించారు.

మామపై అల్లుడు కొడవలితో దాడి

పరిగి: మండలంలోని కోనాపురం గ్రామంలో మామపై అల్లుడు కొడవలితో దాడి చేసిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంగడుయాదవ్‌ తెలిపిన మేరకు... మోదా పంచాయతీ పరిధిలోని కోనాపురంలో నివాసముంటున్న సనాతన్‌కు ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్‌ వస్తోంది. తాగుడుకు బానిసైన ఇతని అల్లుడు ప్రశాంత్‌ డబ్బుల కోసం తరచూ సనాతన్‌తో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం యథావిధిగా డబ్బులడిగాడు. ఇవ్వకపోవడంతో కొడవలితో సనాతన్‌పై దాడి చేయగా అతడి చేయి, తలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement