క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

Feb 4 2026 7:17 AM | Updated on Feb 4 2026 7:17 AM

క్రిమ

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

అనంతపురం: ‘కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలతో చెలగాటమాడటం తగదు. పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అసత్య ప్రచారం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థల విచారణలో నెయ్యి కల్తీ కాలేదని తేల్చినా దుష్ప్రచారానికి తెగబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. తిరుమల లడ్డూ విషయంలో అసత్య, ఆధారరహిత ఆరోపణలతో పబ్బం గడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా అనంతపురంలో డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, బీసీ సెల్‌ అనంతపురం నగర అధ్యక్షుడు లక్ష్మన్న, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి నారా లోకేష్‌ తదితరులు రాజ్యాంగ బద్ధమైన, కార్యనిర్వాహక పదవుల్లో ఉండి తిరుమల తిరుపతి దేవస్థానాల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించారని, ఇందుకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను ఎస్‌ఐ రామకృష్ణకు సమర్పించారు. లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ సిట్‌ దర్యాప్తు, ల్యాబ్‌ నివేదికలు వెల్లడించాయన్నారు. వీటిని ప్రజల ముందు ఉంచకుండా ఆధారరహిత వ్యాఖ్యలు చేయడం వల్ల సామాన్య ప్రజలు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటనల కారణంగా భక్తులు, ప్రజలు వర్గాలుగా విడిపోయి, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికగా తీవ్రస్థాయిలో వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, కొంతమంది బోర్డు సభ్యులతో కలిసి గత నెల 30న విలేకరుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తామిచ్చిన ఆధారాలను పరిశీలించి.. ప్రజాశాంతి, సామరస్యం, క్రమశిక్షణకు మరింత భంగం కలగకుండా చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, మల్లెమీద నరసింహులు, లక్ష్మన్న, మేయర్‌ వసీం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్‌, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను భక్తులు గమనించాలని తెలిపారు. తిరుమల లడ్డూ కల్తీ కాలేదని సీబీఐ సిట్‌ నివేదిక స్పష్టం చేసినా.. ప్రజలను తప్పుదోవపట్టిస్తూ అవాస్తవాలతో ఫ్లెక్సీలు వేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్‌, ఓబిరెడ్డి, సైఫుల్లా బేగ్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, కార్పొరేటర్లు శ్రీనివాసులు, గురు శేఖర్‌బాబు, సంపంగి రామాంజనేయులు, కమల్‌ భూషణ్‌, అనిల్‌ కుమార్‌రెడ్డి, రాజేశ్వరి, వై.లక్ష్మీదేవి, దుర్గాదేవి, లావణ్య, హసీనా, అబూసులెహ, రహంతుల్లా, ఇషాక్‌ బూత్‌ కమిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, క్రిస్టియన్‌ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానీ, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలుమూరు శ్రీనివాస్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు సుబ్బయ్య, చింతకుంట మధు, సాకే కుల్లాయిస్వామి, నాగార్జునరెడ్డి, రవీంద్ర, సుకేశ్‌, రాజు, పవన్‌ కుమార్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌, జగదీష్‌, కిశోర్‌, రామచంద్ర, బిందుప్రియ, నరసింహారెడ్డి, వినిత్‌, తనిషా, ఉదయ్‌, ఫయాజ్‌, దాదా ఖలందర్‌, దాదు, షంషుద్దీన్‌, మహబూబ్‌ బాషా, అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.

దుష్ప్రచారాలకు చెక్‌ పెట్టండి

లడ్డూ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారంపై శింగనమలలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆలమూరు పరంధామరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు పెరిగిపోయాయని, వీటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ సమన్వయకర్త ఎం.వీరాంజనేయులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, బొమ్మన శ్రీరామ్‌రెడ్డి, జెడ్పీటీసీ నీలం భాస్కర్‌, ఎన్‌వీ నారాయణ, ఉల్లికల్లు వెంకటనారాయణ, బండి శ్రీనివాసులు, చిన్నంపల్లి నరసయ్య, బంగారు అలీ, శివపురం పట్రా వెంకటప్ప, దుద్దుకుంట భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులు నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గం: రూరల్‌ సీఐ వెంకటరమణ కు ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి,

చిత్రంలో ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు

అనంతపురం టూటౌన్‌ పోలీసులకు వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఫిర్యాదు అందజేస్తున్న డిప్యూటీ మేయర్‌ వాసంతి, బీసీ రమేష్‌గౌడ్‌ తదితరులు

ఉరవకొండలో ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

శింగనమల పోలీసులకు ఫిర్యాదు అందజేస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం, వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు చెక్‌ పెట్టాలని కోరుతూ మంగళవారం రాయదుర్గం రూరల్‌, అర్బన్‌ పోలీస్‌ స్టేషన్లలో మెట్టు ఆధ్వర్యంలో ఫిర్యాదులు అందజేశారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేశారు.

ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ నేతలు సీఐ మహానందికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు , పవన్‌ కళ్యాణ్‌ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపారని పేర్కొని హిందూవుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో మాట్లాడారన్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్లపై దాడి చేసిన టీడీపీ నాయకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఈడిగ ప్రసాద్‌, పార్టీ రాష్ట్ర నాయకులు బసవ రాజు, ఏసీ ఎర్రిస్వామి పాల్గొన్నారు.

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

లడ్డూ కల్తీ కాలేదని తేలినా ఆగని అసత్య ప్రచారాలు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌పై చర్యలకు డిమాండ్‌

జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఫిర్యాదులు

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి 1
1/4

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి 2
2/4

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి 3
3/4

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి 4
4/4

క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement