‘‘అనంతపురంలో కళ్యాణదుర్గం రోడ్డులోని ఒక వినియోగదారుడికి
అనంతపురం టౌన్: స్మార్ట్‌మీటర్ల రాకతో మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రత అగమ్య గోచరంగా మారింది. ఈ క్రమంలో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రీడర్లు సమ్మెకు దిగారు. 6 రోజులుగా విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నెల విద్యుత్ బిల్లులను కొట్టే ప్రసక్తే లేదని, సమస్యలను పరిష్కరించే వరకు వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుండడం గమనార్హం.
అనంతపురం జిల్లాలో సుమారు 8,30,000 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, శ్రీ సత్యసాయి జిల్లావ్యాప్తంగా 7,20,000 వరకూ కనెక్షన్లున్నాయి. మీటర్ రీడర్ల సమ్మె కారణంగా విద్యుత్ వినియోగదారులపై పెనుభారం పడే అవకాశం ఉంది. వినియోగదారులకు ప్రతి నెలా 1– 8వ తేదీలోపు బిల్లు అందించేవారు. ప్రస్తుతం రీడర్లు సమ్మెలో ఉండడంతో ఈ నెలలో బిల్లులు ఇచ్చే పక్రియ ప్రారంభం కాలేదు. దీంతో వినియోగదారుల స్లాబ్ సైతం మారే అవకాశం లేకపోలేదు. బిల్లులో సైతం భారీగా వ్యత్యాసం వచ్చే అవకాశం ఉంది. 0–50 యూనిట్ల వినియోగం లోపు ఉంటే యూనిట్‌కు రూ.1.50, 50–75 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే యూనిట్‌కు రూ.3 చొప్పున, 76–125 యూనిట్లు ఉంటే రూ.4.50 చార్జ్ చేస్తారు. అదే 126–225 ఉంటే యూనిట్‌కు రూ.6 చొప్పున వేస్తారు. ఈ నెల విద్యుత్ బిల్లింగ్ ఆలస్యం కావడంతో స్లాబ్‌ను మించి ఒక యూనిట్ దాటినా భారీగా విద్యుత్ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి బిల్లులను కొట్టేలా చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
సమ్మెలో మీటర్ రీడర్లు
ప్రారంభం కాని బిల్లింగ్ ప్రక్రియ
ఇంకా ఆలస్యమైతే బిల్లు మొత్తం
పెరిగే అవకాశం
ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురి డిమాండ్
వినియోగదారులపై పెనుభారం..
‘‘అనంతపురంలో కళ్యాణదుర్గం రోడ్డులోని ఒక వినియోగదారుడికి


