సరళంగా.. సులభంగా
రాయదుర్గంటౌన్: కేంద్ర ప్రభుత్వం ఆధార్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు, సురక్షితంగా, సులభతరంగా అందుబాటులోకి తీసుకు రావాలనే లక్ష్యంతో కొత్త ఆధార్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఆధార్ యాప్‌తో ఇక చిన్న చిన్న మార్పుల (అప్‌డేట్స్) కోసం ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆధార్‌లో అడ్రస్ మార్చాలన్నా.. ఫోన్ నంబర్ అప్డేట్ చేయాలన్నా గంటల తరబడి లైన్లలో నిలబడి వేచిచూడాల్సిన పని ఏమాత్రమూ లేకుండా కొత్త యాప్‌లో సౌకర్యాలను సులభతరం చేశారు. అంతేకాక ఒకే స్మార్ట్‌ఫోన్‌లోనే ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ వివరాల ప్రొఫైల్‌ను సైతం పొందుపరుచుకునే సౌకర్యం కల్పించారు. ఆధార్ నంబర్ లాక్, అన్‌లాక్ సౌకర్యం కూడా ఉంది. ఈ యాప్ ద్వారా ఇంట్లో కూర్చునే మొబైల్ నుంచే ఈ సేవలన్నీ పొంద వచ్చు.రోజువారీ గుర్తింపు ధ్రువీకరణలు సరళంగా, భద్రంగా మార్చడమే మార్పుల వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం.
వివరాలు ఫుల్‌సేఫ్..
ఎక్కడపడితే అక్కడ ఆధార్ నెంబర్, వేలిముద్రలు (బయోమెట్రిక్) ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త యాప్ ద్వారా ఐడెంటిటీని సులువుగా రుజువు చేసుకోవచ్చు. అంతేకాక ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా ఇందులో వెరిఫికేషన్ చేసుకొనే వెసులు బాటు కల్పించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలను సైతం పరిశీలించుకోవచ్చు. ఆధార్ నంబర్, బయోమెట్రిక్ వివరాలు పంచుకోకుండానే గుర్తింపు నిర్ధారించే విధానాన్ని ఈ యాప్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం గమనార్హం. ఇది వినియోగదారుడికి పూర్తిగా నియంత్రణలో ఉండి భద్రతను అందిస్తుంది. కొత్త ఆధార్ యాప్ ద్వారా అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసుకుని షేర్ చేయొచ్చు. పేరు, వయస్సు వంటి పరిమిత వివరాలతో పాస్‌వర్డ్ రక్షిత ఫైల్‌ను తయారు చేసి పంచుకునే అవకావం ఉంది.
స్మార్ట్ ఫోన్‌లోనే ఫ్యామిలీ అంతా..
కొత్త ఆధార్ యాప్‌లో పొందుపరిచిన మరొక అద్భుతమైన సౌకర్యం ఇది. మీ ఒక్కరిదే కాకుండా ఇంట్లో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను ఫోన్ నుంచే మేనేజ్ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలకు సంబంధించిన వివరాలు ఒకే చోట లభిస్తుండడంతో ఆధార్ వివరాలు తెలియజేసేందుకు, ఐడీగా చూపేందుకు ఎంతో సౌకర్యవంతమైన ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఈ నూతన ఆధార్‌యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ అప్‌డేట్ ఇక మీ చేతుల్లోనే..
మొబైల్ నెంబర్, చిరునామా మార్పు కొత్త యాప్‌లో సులభతరం
ఒకే స్మార్ట్‌ఫోన్‌లో ఐదుగురు
కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు


