నేడు నవోదయ ప్రవేశాలకు పరీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు నవోదయ ప్రవేశాలకు పరీక్ష

Feb 7 2026 9:53 AM | Updated on Feb 7 2026 9:53 AM

నేడు నవోదయ  ప్రవేశాలకు పరీక్ష

నేడు నవోదయ ప్రవేశాలకు పరీక్ష

లేపాక్షి: లేపాక్షి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి శనివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూపురం పట్టణంలో అజిజీయ, ఎంజీఎం, ముద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 850 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అలాగే ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ఏర్పడిన ఖాళీలకు 1,205 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికి లేపాక్షిలోని జవహర్‌ నవోదయ విద్యాలయం, ఎంజేపీఏపీ గురుకుల పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు అడ్మిట్‌ కార్డులతో ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement