సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ
అనంతపురం: ఈ నెల 13 నుంచి మూడు రోజుల పాటు గుత్తి మండలం సేవాగఢ్‌లో జరిగే సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరి సాంబశివారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌నాయక్, జిల్లా ఎస్టీ విభాగం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస నాయక్‌తో కలసి ఆదివారం ఆయన సంత్ సేవాలాల్ జయంత్యుత్సవాల పోస్టర్లను ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో వెంకటేష్ నాయక్, సోమ్లా నాయక్, ధనుంజయ నాయక్, సీనా నాయక్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీలో
‘అనంత’కు ప్రాధాన్యత
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాధాన్యత కల్పించారు. ఆదివారం విజయవాడ వేదికగా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకోగా ఇందులో జిల్లాకు చెందిన పాతిరెడ్డికి రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి అవకాశం కల్పించారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా రాచంరెడ్డి మాధవి, రాష్ట్ర జీఓల కమిటీ మెంబర్‌గా జి.గురురాజను ఎన్నుకున్నారు. ఎంపికపై కమిటీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు దేశాయ్ నాగరాజు, సబ్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
చిరుత కోసం గాలింపు
శింగనమల(నార్పల): బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం, నార్పల మండలం బొందలవాడలో చిరుతల సంచారంపై జిల్లా అటవీ శాఖ అప్రమత్తమైంది. ఈ రెండు గ్రామాల కొండల్లో ఆదివారం సిబ్బందితో కలసి అటవీశాఖ అధికారి చక్రపాణి పర్యటించి, చిరుత జాడ కోసం గాలించారు. డ్రోన్ సాయంతో చిరుతల కదిలికలను గుర్తించే ప్రయత్నం చేశారు. ఆయన వెంట గుత్తి, అనంతపురం, కదిరి ఫారెస్ట్ రేంజర్లు, సిబ్బంది ఉన్నారు.
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ
సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి పోస్టర్ల ఆవిష్కరణ


