కన్నడ స్టార్ హీరో 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మార్క్'. గతేడాదిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ మూవీ విడుదలైంది. అయితే, తాజాగా ఓటీటీ విడులపై అధికారికంగా ప్రకటించారు. ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించారు. క్రిస్మస్ సమయంలో తెలుగు సినిమాలు భారీ సంఖ్యలు విడుదలయ్యాయి. దీంతో ఈ మూవీకి తెలుగులో థియేటర్స్ కొరత ఏర్పడింది. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది.

మార్క్(Mark) సినిమా జనవరి 23న జియోహాట్‌స్టార్ (JioHotstar)లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌లలో తన నటన హైలైట్ అని రివ్యూలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నాయన్నారు. కథ చాలా బలహీనంగా ఉండటం.. ఆపై ఊహించదగిన ట్విస్టులతో కాస్త నిరాశపరిచిందని విమర్శలు వచ్చాయి. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారిని మాత్రం మ్యాక్స్ ఆకట్టుకుంటాడని చెప్పొచ్చు.


