తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. భూమి పెడ్నేకర్ ఇప్పుడు అలా ఓ కొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌తో వచ్చేందుకు సిద్ధమైంది. 'దల్ దల్' పేరుతో తీసిన ఈ సిరీస్ ఈ నెల 30 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించింది.
(ఇదీ చదవండి: శాపాలు పెడుతున్న రేణు దేశాయ్.. షాకింగ్ పోస్ట్)
ఇందులో భూమి పెడ్నేకర్ పోలీస్ అధికారిగా నటించింది. ఈమె ఉంటున్న ఊరిలో వరస హత్యలు, అవి కూడా కాస్త వింతగా జరుగుతుంటాయి. ఇంతకీ వీటి వెనకున్నది ఎవరు? చిన్నతనంలో భూమి ఎదుర్కొన్న అనుభవాలేంటి? అనేదే సిరీస్ కాన్సెప్ట్‌లా అనిపిస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 28 సినిమాలు)


