కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్‌నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రిస్’.ఈ చిత్రాన్ని హరీశ్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించగా మౌంట్ మేరు పిక్చర్స్ పతాకంపై కృష్ణ వోడపల్లి నిర్మించారు. నవంబర్ 14న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime), సన్ నెక్స్ట్ (SunNXT)లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్స్‌లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయినా..ఓటీటీలో మాత్రం సినిమా దూసుకెళ్తోంది. . రెండు మేజర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లలో ట్రెండ్ అవుతూ, ఈ చిత్రం ఒక రికార్డును నెలకొల్పింది.
కేవలం ఒక్క భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీలో కేవలం నవ్వులే కాదు, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో ఈ సినిమా ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ఎక్కడా అసభ్యత లేకుండా, కుటుంబం అంతా కలిసి చూసేలా ఈ కథను ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా అద్భుతంగా తీర్చిదిద్దారు. కృష్ణ బురుగుల తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తూ మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన నటనలో ఎక్కడా అతి కనిపించదు, అంతా చాలా నేచురల్ గా ఉంటుంది.


