ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలోకి ఎప్పుడు? | Dhurandhar 2 And Ustaad Bhagat Singh OTT Details Latest | Sakshi
Sakshi News home page

OTT Details: కొత్త సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్

Mar 19 2026 1:05 PM | Updated on Mar 19 2026 1:45 PM

Dhurandhar 2 And Ustaad Bhagat Singh OTT Details Latest

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలు వచ్చేశాయి. పేరుకే హిందీ అయినప్పటికీ 'ధురంధర్'కి మన దగ్గర కూడా ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. మరోవైపు పవన్ చిత్రానికి అభిమానులు తప్పితే సగటు ఆడియెన్స్ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే ఇంతకీ ఈ మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ సంగతేంటి? ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుప్రీత చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

ముందుగా 'ధురంధర్ 2' విషయానికొస్తే తొలి భాగం డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి విక్రయించారు. ఇప్పుడు రిలీజైన సీక్వెల్‌ని మాత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్‌కి చెందిన హాట్‌స్టార్‌కి ఇచ్చేశారు. మొదటి పార్ట్‌లానే ఈసారి కూడా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మే చివరి వారంలోనే 'ధురంధర్ 2' డిజిటల్‌గా అందుబాటులోకి వస్తుంది. అయితే దీన్ని థియేటర్లలోనే చూడాలని చాలామంది అంటున్నారు.

మరోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేశారు. అయితే ఇది ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని నిర్మాత చెప్పుకొచ్చారు. అంటే ఏప్రిల్ చివరి వారంలో పవన్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంటుంది. సోషల్ మీడియాలో వినిపించినట్లు ఇది 'తెరి' రీమేక్ అయితే కాదనే క్లారిటీ వచ్చింది. కాకపోతే రొటీన్ కమర్షియల్ పోలీస్ టెంప్లేట్ స్టోరీతోనే దీన్ని తెరకెక్కించారు. టాక్ అయితే నెగిటివ్‌గానే వస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు సంగతి ఏంటనేది తెలుస్తుంది.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement