సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఇందిరాగాంధీ జూపార్క్ మూసివేతపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ తీసుకున్నా పార్క్ లోపలకు పంపడం లేదని పర్యాటకులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ పర్యటన కారణంగా అధికారులు.. జూపార్క్‌ను మూసేశారు. పవన్ కల్యాణ్ పర్యటనపై సమాచారం లేకుండా జూపార్క్ మూసివేశారు. జూపార్క్ సందర్శన కోసం ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు.

పవన్ పర్యటన ఉన్నట్లు కనీసం బోర్డులు కూడా పెట్టలేదని సందర్శకుల అసహనం వ్యక్తం చశారు. ఉదయం నుంచి జూపార్క్‌ను మూసివేయడంతో పర్యాటకులు పడిగాపులు గాస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అనుమతిస్తామన్న జూపార్క్ అధికారులు.. ఒంటి గంట తర్వాత కూడా అనుమతించకపోవడంతో పర్యాటకుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు జూపార్క్ సందర్శనకు రావాలన్న సెక్యూరిటీ సిబ్బందితో పర్యాటకులు వాగ్వాదానికి దిగారు.



