తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలని వైఎస్సార్‌సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యి కల్తీ జరగలేదంటూ సీబీఐ రిపోర్ట్ చూసైనా చంద్రబాబు బుద్ధితెచ్చుకోవాలన్నారు. ఈరోజు(గురువారం, జనవరి 29వ తేదీ) చంద్రబాబు మాటలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
సీబీఐ చార్జ్‌షీట్ చూశాక కోట్లాది మంది భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల లడ్డూలో జంతవుల కొవ్వు కలపలేదని తేలింది. దీంతో జనం తమను రాళ్లతో కొడతారని కూటమి నేతల భయపడ్డారు. అందుకే మళ్లీ తప్పుడు రాళ్లతో కొడతారని కూటమి నేతలు భయపడ్డారు. అందుకే మళ్లీ తప్పుడు ప్రచారాలతో ఫ్లెక్సీలు వేస్తున్నారు.
ఎల్లోమీడియా అంతరాత్మతో పని చేయాలి. ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. దళితులపై దాడులు చేసి చంపేస్తున్నారు. నిత్యం మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. చేసిన అప్పులను ఏం చేస్తున్నారు?, ఎంతసేపూ పబ్లిసిటీ, ప్రత్యర్థులపై బురద జల్లటం తప్ప మరేమీ జరగటం లేదు. రైతులు, యువత, మహిళలు ఏ వర్గమూ ప్రశాంతంగా లేదు. యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ముందా?, హెరిటేజ్ నెయ్యి తక్కువ ధరకు ఎలా ఇస్తున్నారు?, అందులో ఏం కల్తీ కలుపుతున్నారో చంద్రబాబు వెల్లడించాలి. బోలేబాబా డెయిరీని తెచ్చింది చంద్రబాబే. చంద్రబాబు కుట్రలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచన చేయాలి’ అని స్పష్టం చేశారు.


