నిజామాబాద్ : నిజామాబాద్ కార్పోరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. మన నిజామాబాద్ మన అభివృద్ధి... పేరుతో ముందుకు వెళ్తామన్నారు. ఈరోజు(ఆదివారం, జనవరి 25వ తేదీ) నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ముఖ్య కార్తకర్తల సమావేశంలో పాల్గొన్న మహేష్‌కుమార్ గౌడ్.. ప్రసంగించారు.
మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాల కోసమే ఉత్తమ్‌కు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. కాంగ్రెస్.. బీజేపీకి ఎంత దూరమో మజ్లిస్‌కు అంతే దూరం. బీజేపీ నేతల అబద్ధాన్ని ప్రచారం చేసి ఇంటింటికి విషం చిమ్ముతన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్స్ కోసం తొందర వద్దు, ప్రలోభాలతో టికెట్స్ రావు ,డబ్బులు ఎవరికి ఇవ్వొద్దు. కులం , మతం పేరిట ప్రజల జీవితాలు విచ్చిన్నం చేస్తానంటే చూస్తూ ఊరుకోం’ అని స్పష్టం చేశారు.


