సాక్షి,తాడేపల్లి: అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ సీసీ నేతలు, క్యాడర్‌కు భరోసా ఇచ్చారు.

నకిలీ మద్యం కేసులో అరెస్టై 83 రోజుల పాటు జైల్లో ఉండి ఇటీవలే జోగి రమేష్, రాము విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.

ఈ భేటీలో తమను, తమ కుటుంబాన్ని అక్రమ కేసులతో టీడీపీ ప్రభుత్వం ఇబ్బందిపెట్టిన తీరును జోగి సోదరులు వైఎస్ జగన్‌కు వివరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, క్యాడర్ ఎవరూ అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధీటుగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. పార్టీ లీగల్ సెల్ నుంచి అవసరమైన న్యాయ సహాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా జోగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకుని వారందరికీ వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు.


