breaking news
Jogi Ram Babu
-
‘అధైర్యం వద్దు.. మీకు అండగా నేను ఉన్నాను’
సాక్షి,తాడేపల్లి: అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ సీసీ నేతలు, క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. నకిలీ మద్యం కేసులో అరెస్టై 83 రోజుల పాటు జైల్లో ఉండి ఇటీవలే జోగి రమేష్, రాము విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు.ఈ భేటీలో తమను, తమ కుటుంబాన్ని అక్రమ కేసులతో టీడీపీ ప్రభుత్వం ఇబ్బందిపెట్టిన తీరును జోగి సోదరులు వైఎస్ జగన్‌కు వివరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, క్యాడర్ ఎవరూ అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధీటుగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. పార్టీ లీగల్ సెల్ నుంచి అవసరమైన న్యాయ సహాయం అందుతుందన్నారు. ఈ సందర్భంగా జోగి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకుని వారందరికీ వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. -
పదవులు ఇస్తామని ప్రకటించే దమ్ము చంద్రబాబుకు ఉందా: మంత్రి జోగి రమేష్
-
పెడన ఆలయంలో చోరీ
పెడన, న్యూస్‌లైన్ : పట్టణంలోని శివాలయం ప్రాంగణంలో గల అయ్యప్పస్వామి ఉపాలయంలో హుండీని దొంగలు పగులగొట్టి నగదు అపహరించుకుపోయారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక గుడివాడ రోడ్డులోని శ్రీ గంగా పార్వతి సమేత ఆగస్థేశ్వర స్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి ఉపాలయం ఉంది. శనివారం తెల్లవారుజామున పూజారి గూడూరు ఆగస్థయ్య వచ్చి చూడగా అయ్యప్పగుడిలోని హుండీ పగులగొట్టి ఉంది. కొన్ని నాణేలు ఆ ప్రదేశంలో పడి ఉన్నాయి. దీనిపై ఆలయ కమిటీ సభ్యులు, ఈవో జోగి రాం బాబుకు ఫోన్లో సమాచారం అందించారు. ఈవో ఫిర్యాదు మేరకు ఎస్సై శివరామకృష్ణ సిబ్బందితో వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. హుండీలోని నోట్లను మా త్రమే దుండగులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అపహరణకు గురైన మొత్తం రూ.25 వేలు వరకు ఉంటుందని భావిస్తున్నారు. హుండీలో మిగిలిన నాణేలను సిబ్బంది లెక్కించగా మొత్తం రూ.3,011 ఉంది. ఈ ఘటనపై కేసు నమోదవగా, ఎస్సై శివరామకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే ఆలయంలో దొంగతనానికి విఫలయత్నం జరిగింది. గుడికి నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని దేవాదాయశాఖ అధికారులను ఆలయ కమిటీ సభ్యులు బండారు ఆనంద ప్రసాద్, కొల్లూరి నాగభూషణం కోరారు.


