తాడేపల్లి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు (బుధవారం, జనవరి 28వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. రేపు ఉదయం గం. 11లకు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ అవుతారు. ప్రధానంగా నియోజకవర్గంలో ప్రజాసమస్యలు, రాజకీయ పరిణామాలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు.
కాగా, గత వారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలను శ్రేణులకు వివరించారు. ఇక నుంచి ప్రతి వారం ఒక నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశమవుతానని, ఇదే పోరాట స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఇవీ చదవండి:


