సాక్షి, ఏలూరు జిల్లా: చంద్రబాబు జుగుప్సాకరమైన రాజకీయం చేస్తున్నారని.. ఇంతకంటే దుర్మార్గం ఏముంది? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ‘‘తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు, చేపల నూనె కలిపారని దుష్ప్రచారం చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ దుర్గగుడికి మెట్లు కడిగారు. తిరుపతి అపవిత్రమైందంటూ సంప్రోక్షణ చేశారు. పాపపు మాటలు మాట్లాడిన చంద్రబాబు నాలుకపై వాతలు పెట్టాలి’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లడ్డూలో ఎలాంటి పంది, జంతువు, చేప కొవ్వు కలవలేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చెప్పిందని పేర్ని నాని గుర్తు చేశారు. ‘‘కలియుగదైవం వెంకటేశ్వరస్వామి వేసే శిక్షను చంద్రబాబు,పవన్ తప్పించుకోగలరా?. వెంకటేశ్వరస్వామి పవిత్రతో ఆటలాడిన చంద్రబాబు, పవన్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలి’’ అని పేర్ని నాని డిమాండ్ చేశారు.


