పద్మ పురస్కార విజేతలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు | Ys Jagan Congratulates The Padma Award Winners | Sakshi
Sakshi News home page

పద్మ పురస్కార విజేతలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

Jan 25 2026 8:00 PM | Updated on Jan 25 2026 8:02 PM

Ys Jagan Congratulates The Padma Award Winners

సాక్షి, తాడేపల్లి: పద్మ పురస్కార విజేతలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 2026గానూ కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా.. తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వివిధ రంగాల్లో మీరు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement