breaking news
padma shri awards 2026
-
పద్మ పురస్కార విజేతలకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: పద్మ పురస్కార విజేతలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 2026గానూ కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా.. తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. వివిధ రంగాల్లో మీరు సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. -
తెలుగు రాష్ట్రాలకు ‘పద్మశ్రీ’ అవార్డులు
ఢిల్లీ: 2026గానూ పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఇవాళ ( జనవరి 25, ఆదివారం) ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు లభించాయి. తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన నలుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.సినీ నటులు రాజేంద్రప్రసాద్(ఏపీ), మాగంటి మురళీమోహన్(ఏపీ) పద్మశ్రీ అవార్డులు లభించాయి. కళల విభాగంలో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(ఏపీ), దీపికారెడ్డి(తెలంగాణ) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వైద్య విభాగంలో గూడూరు వెంకటరావు(తెలంగాణ) పద్మశ్రీ, పాలకొండ విజయ్ ఆనంద్‌రెడ్డి(తెలంగాణ)లకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో చంద్రమౌళి గడ్డమానుగు (తెలంగాణ), కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం(తెలంగాణ), కుమారస్వామి తంగరాజు (తెలంగాణ), విద్య విభాగంలో వెంపటి కుటుంబ శాస్త్రి(ఏపీ), పశుసంవర్ధక విభాగంలో రామారెడ్డి మామిడి (తెలంగాణ)కి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. -
జాతకాలకంటే జన్యుక్రమాలు చూడటం మేలు!
పెళ్లంటే... అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలంటారు. కానీ... ఈ స్పీడు యుగంలో అంత ఓపిక, తీరిక ఎవరికీ ఉండటం లేదు. అందుకే.. జాతకాల కంటే జన్యుపత్రికలు కలిస్తే మేలంటున్నారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్! జన్యుశాస్త్ర పరిశోధనల్లో దశాబ్ధాల అనుభవమున్న, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్త చెప్పేది సింపుల్!జన్యుక్రమాల ఆధారంగా పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో జన్యు వ్యాధుల బారిన పడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి అని! అంతే కాదు.. జన్యువ్యాధుల నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద కార్యక్రమం గురించి.. జన్యువులకు.. జబ్బులకు వేసుకునే మందులకూ మధ్య ఉన్న సంబంధం గురించి.. మరెన్నో అంశాలపై పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయన ‘సాక్షి.కాం’తో సవివరంగా మాట్లాడారు. హైదరాబాద్‌లో సీసీఎంబీలో పనిచేస్తున్న ఆయనకు జన్యు సంబంధ పరిశోధనలకు గాను 2026-పద్మశ్రీ అవార్డు లభించిందిప్రశ్న: జాతకాలు కలవడం కంటే జన్యుక్రమాల మేళవింపు ముఖ్యమన్న శాస్త్రవేత్త మీరు. ఎందుకో వివరిస్తారా? జవాబు: భారత దేశంలో ఇప్పటికీ మేనరికాలు ఎక్కువ. అంతేకాకుండా.. శతాబ్దాలుగా ఒకే సమూహంలో (కులం, దగ్గరి బంధువుల్లో) పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీనివల్ల మన జన్యువుల్లోని వ్యాధికారక మార్పులు ఆయా సమూహాల్లో బలపడుతూ వస్తాయి. తల్లిదండ్రుల నుంచి అందుకునే క్రోమోజోముల్లో (ఎక్స్, వై, లు మినహాయించి) ఒకే ఒక్క మార్పు ఉన్నా సంతానానికి వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువవుతుంది. దీన్ని ఆటోసోమల్ రిసెసివ్ మ్యూటేషన్ అంటారు.తరాలు మారుతున్న కొద్దీ ఈ మార్పులతో ఉండే వారి సంఖ్య పెరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఆటోసోమల్ మ్యూటేషన్స్ ఉంటే పుట్టే బిడ్డకు జన్యుపరమైన వ్యాధి వచ్చే అవకాశం 25 శాతమవుతుంది. అందుకే మీడియా సహాయంతో ఈ సమాచారాన్ని సమాజానికి సులభమైన భాషలో, చేరవేయడం, కుటుంబం/కులంలోనే పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే రిస్క్‌ల గురించి చెప్పడం అవసరం, కానీ బలవంతంగా ఏమీ రుద్దకుండా, సమాచారం ఇచ్చి ప్రజలే నిర్ణయం తీసుకునేలా చేయాలి.ప్రశ్న: సరే.. పెళ్లికి ముందు ఎలాంటి జన్యు పరీక్షలు చేయించుకుంటే మేలంటారు?జవాబు: దీనిని రెండు భాగాలుగా చూడాలి. కుటుంబంలో లేదా సమూహంలో జన్యువ్యాధులు ఉన్న వారు ఎవరైనా ఉన్నారా? దానికి కారణమయ్యే జన్యుమార్పులు ఏవన్నది గుర్తించారా? చూసుకోవాలి. ఆ మార్పు పెళ్లి చేసుకోబోయే వారు ఇద్దరిలోనూ ఉందా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలి. రెండవది – కుటుంబ చరిత్రలేమీ లేకపోయినా... స్థూలంగా కొన్ని కొన్ని వ్యాధికారక జన్యుమార్పుల కోసం పరీక్షించడం. కొన్ని వ్యాధులకు కారణమైన జన్యుమార్పులను ఇప్పటికే గుర్తించారు.అయితే ఇది చాలా జాగ్రత్తగా జరగాలి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సహజంగానే కొన్ని జన్యుమార్పులు ఉంటాయి, అలాంటి వారికి నీలో జన్యుమార్పు ఉంది అంటే ఆందోళనకు గురికావచ్చు. రక్తసంబంధం లేకుండా... ఒకేరకమైన ఆటోసోమల్ రిసెసివ్ మ్యూటేషన్ లేకపోతే సమస్య ఏమీ ఉండదు కానీ.. ఏ జన్యువులు, ఏ రకమైన మార్పులను పరిశీలించాలన్న విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం కూడా ఉంది.ప్రశ్న: జన్యుమార్పులు మనం తీసుకునే మందులపై కూడా ప్రభావం చూపుతాయా? జవాబు: అవును. శస్త్రచికిత్సలకు ముందు ఇచ్చే మత్తుమందులే (అనస్తీషియా) ఒక ఉదాహరణ. నిర్దిష్ట జన్యుమార్పులున్న ఒక సామాజిక వర్గంపై వీటి ప్రభావం భిన్నంగా ఉంటుంది. జన్యుమార్పులుంటే ఈ మందులు శరీరంలో ఆలస్యంగా జీర్ణమవుతాయి. దీంతో అనుకున్నదానికంటే చాలా ఎక్కువసేపు అనస్తీషియా ప్రభావం కొనసాగి, కొన్ని సందర్భాల్లో పక్షవాతం లేదా ప్రాణాపాయం జరగవచ్చు.కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు తీసుకునే మందులు కూడా కొన్ని జన్యుమార్పులున్న వారిపై భిన్నమైన ప్రభావం చూపుతాయి. అంటే... వ్యాధికారక, మందులకు స్పందించే జన్యుమార్పులను వేర్వేరుగా గుర్తించేందుకు పరీక్షలు అవసరమన్నమాట. భవిష్యత్తులో రాగల వ్యాధులకు సంబంధించిన పరీక్షలూ జోడించి తగిన మార్గదర్శకాలు రూపొందిస్తే దేశ ప్రజలకు మేలు జరుగుతుంది.ప్రశ్న: జన్యు పరీక్షలతో గుండెజబ్బులను ముందే గుర్తించవచ్చా?జవాబు: జన్యు పరీక్షల ద్వారా రెండు రకాల లాభాలున్నాయి. ముందుగా గుర్తించడం ఒకటైతే... వ్యాధి వేగంగా ముదిరిపోకుండా చూసుకోవడం రెండోది. ఉదాహరణకు కార్డియోమయోపతిని తీసుకుందాం. జన్యుక్రమంలో నిర్దిష్ట మార్పు ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.తల్లిదండ్రులు ఇద్దరి నుంచి ఈ మార్పు సంక్రమించి ఉంటే ప్రమాదం ఎక్కువ. ఒకరి నుంచి మాత్రమే అందితే తక్కువగా ఉంటుంది. పదేళ్ల కుర్రవాడు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయినప్పుడు.. అతడి గుండె కండరాలను విశ్లేషించడం ద్వారా శాస్త్రవేత్తలు జన్యుమార్పు ప్రభావాన్ని గుర్తించారు. అలాంటి మ్యూటేషన్లను ముందుగానే గుర్తిస్తే, గుండెజబ్బు రావడాన్ని ఆలస్యం చేయవచ్చు. ప్రశ్న: కోవిడ్ టీకా తీసుకున్న తరువాత యువకులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారన్న అంచనా ఉంది. రెండింటికీ సంబంధం ఉందా? జవాబు: కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత గుండెపోట్లు పెరిగాయన్న అంశంపై కొన్ని నివేదికలు ఉన్నాయి. చర్చలూ జరిగాయి. అయితే ఇప్పటివరకు ఈ అంశంపై “కోవిడ్ వ్యాక్సిన్ వల్లే గుండె రోగాలు పెరిగాయి” అని నిర్దిష్టంగా నిరూపించిన అధ్యయనం ఏదీ లేదు. ప్రశ్న: భారతదేశంలో స్థూలంగా 4635 జన సమూహాలు ఉన్నాయి. వీరందరికీ జన్యు పరీక్షలు చేయించడం మేలా?జవాబు: దగ్గరి బంధువుల్లోనే పెళ్లిళ్లు జరుగుతూండటం వల్ల దేశంలో కొన్ని సమూహాలకు కొన్ని రకాల జన్యువ్యాధులు వస్తున్నాయి. వీటి తీవ్రత కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒకానొక సముదాయంలో పుట్టిన రెండు నెలలకే పిల్లలు మరణిస్తూంటారు. ప్రజలు అనారోగ్యంగా ఏమీ కనిపించారు కానీ వ్యాధికారక జన్యుమార్పులు కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయా సమూహాలకు జన్యుపరీక్షలు చేయించడం అవసరం. జినోమ్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకూ 83 సమూహాలకు పరీక్షలు పూర్తయ్యాయి కూడా.త్వరలో మరింత ఎక్కువ సమూహాలకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కనీసం పది లక్షల మంది జన్యుక్రమాలను నమోదు చేసి వ్యాధికారక మార్పులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. తద్వారా ఆయా సముదాయాల్లో పెళ్లిళ్ల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది. premarital, prenatal counseling ద్వారా ముందుగానే సూచనలనిచ్చే అవకాశం ఉంటుంది.ప్రశ్న: దేశంలో premarital లేదా prenatal counseling నిర్వహించడానికి తగినంత మంది జన్యు శాస్త్రవేత్తలు, వైద్యులు ఉన్నారంటారా? జవాబు: ఇటీవలి కాలంలో జన్యువ్యాధులపై వైద్యుల్లోనూ అవగాహన బాగా పెరిగింది. చాలా సందర్భాల్లో వారు రోగులను జన్యుపరీక్షలు చేయించుకోమంటున్నారు. వైద్యులు, జన్యు శాస్త్రవేత్తలతోపాటు ఈ రెండు అంశాలను అర్థం చేసుకుని సామాన్యులకు వివరించగల జెనెటిక్ కౌన్సిలర్లు కూడా త్వరలో అందుబాటులోకి వస్తారు. జన్యుశాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే.. వాటి ఫలితాలను ఆధారంగా genetic counselors సలహాలు ఇస్తారు. వైద్యులు చికిత్స అందిస్తారన్నమాట.ప్రశ్న: జన్యుపరంగా చూస్తే భారత్.. దక్షిణాసియా ప్రజల ప్రత్యేకత ఏమిటి? జవాబు: ఆఫ్రికా తర్వాత, అత్యంత పురాతన జనాభా నివసిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. జన్యు ఆధారాల ప్రకారం ఆధునిక మానవుడు (హోమో సేపియన్ సేపియన్) ఆఫ్రికా నుంచి బయటకు వచ్చిన మొదటి సమూహపు వారసులు. కొంతమంది దక్షిణ భారత దేశంలోనే స్థిరపడ్డారు. మరికొందు అండమాన్ మీదుగా ఆస్ట్రేలియాకి వెళ్లారు. దక్షిణాసియా దేశాల జనాభాల్లో కూడా కనీసం 50% వరకు భారతీయ వారసత్వం కలిగి ఉన్నాయి, రోగాలు ముఖ్యంగా కార్డియో మయోపతికి సంబంధించిన జన్యుమార్పులు భారతదేశంతో పాటు శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ మొదలైన దేశాల్లోనూ కనిపిస్తాయి.ప్రశ్న: మీకు అపరిమిత వనరులు ఉన్నాయనుకోండి; జన్యుశాస్త్రంలో మీరు మొదట పరిష్కరించాలనుకునే ఒక పెద్ద సమస్య ఏది?జవాబు: ఆరోగ్యం; దాన్ని ఒక్క రోగానికిపరిమితం చేయకుండా, స్థూల దృష్టితో చూడాలి. ఇందులో రోగాల కారణం, pharmacogenomics, సంక్రమణ రోగాలు – ఇవన్నీ వస్తాయి, వీటిలో ప్రతి దాంట్లోనూ genetics ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చడానికి అనేక అవకాశాలు అందిస్తుంది.ప్రశ్న: నేటి యువ శాస్త్రవేత్తలు genetics రంగంలోకి రావాలనుకుంటే, ప్రత్యేకంగా science, society రెండింటిపై ప్రభావం చూపాలని భావిస్తే మీరు ఏ సలహా ఇస్తారు?జవాబు: హ్యూమన్ genomics రంగంలో ప్రస్తుతం గొప్ప అవకాశాలు ఉన్నాయి; అవసరమైన వనరులు, మౌలిక సదుపాయాలు, నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. జన్యుక్రమ రంగంలో చేసే పనులు సమాజ ఆరోగ్యానికి, దేశానికి ఉపయోగపడతాయి. అందుకే యువత జన్యుశాస్త్రాన్ని కెరియర్‌గా తీసుకుని, తమ సామర్థ్యానికి తగ్గట్లు సమాజానికి, దేశానికి సేవ చేసేలా ప్రోత్సహించాలి. -
పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
2026 సంవత్సరానికి గానూ కేంద్రం ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఐదుగురికి పద్మ విభూషణ్,13 మందికి పద్మభూషణ్, 113 మందికి కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు, కుటుంబశాస్త్రి, రాజేంద్ర ప్రసాద్( కళావిభాగం) మరళీమెహన్( కళావిభాగం), రాజేంద్రప్రసాద్ (కళావిభాగం).... తెలంగాణ విజయ్ ఆనంద్ రెడ్డి, గడ్డమానుగు చంద్రమౌళి, దీపికారెడ్డి (కళావిభాగం), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ లకు పురస్కారం దక్కింది. తెలంగాణలో మెుత్తంగా ఏడుగురికి, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురికి ఈ ఏడాది అవార్డులు దక్కాయి.దివంగత మాజీ సీఎం అచ్యుతానందకు పద్మ విభూషన్, డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. కళా విభాగంలో ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముటికి పద్మభూషణ్ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగాప్రధాని నరేంద్ర మోదీ పద్మ పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. విభిన్న రంగాలలో వారి అంకిత భావం, సేవ, భారత సమాజ నిర్మాణాన్ని సుసంపన్నం చేశాయన్నారు. వారి నిబద్ధత, శ్రేష్ఠత భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.భారతరత్న తర్వాత పద్మ అవార్డులను కేంద్ర ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారాలుగా భావిస్తారు. కళలు, విద్య, సాహిత్యం, క్రీడలు, వైద్యం, సామాజికసేవ, పరిశ్రమలు, వైద్యం, ప్రజాసేవలు ఇలా విభిన్న రంగాలలో ఉత్తమ సేవలు కనబరిచిన వ్యక్తులకు ఈ అవార్డు అందిస్తారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును కేంద్రం ప్రకటిస్తుంది. పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు 1. కుమారసామి తంగరాజ్2 మామిడి రామారెడ్డి ( తెలంగాణ)3. భగవందాస్ రైక్వార్4. భిక్ల్య లడక్య ధిండా5. బ్రిజ్ లాల్ భట్6. బుధ్రి తాటి7. చరణ్ హెంబ్రామ్8. చిరంజీ లాల్ యాదవ్9. ధర్మైక్ లాల్ చునీలాల్ పాండ్యా10. గఫ్రుద్దీన్ మేవాటి జోగి11. హాలీ వార్12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ13. కె. పజనివేల్14. కైలాష్ చంద్ర పంత్15. కేమ్ రాజ్ సుంద్రియాల్ 16. కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి17.అంకె గౌడ18. మహేంద్ర కుమార్ మిశ్రా19. మీర్ హాజీభాయ్ కసంభాయ్20. మోహన్ నగర్21. నరేష్ చంద్ర దేవ్ వర్మ22. నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా23. నూరుద్దీన్ అహ్మద్24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్25. పద్మ గుర్మెట్26. పోఖిల లెక్తేపి27. పున్నిమూర్తి నటేశన్28. ఆర్ కృష్ణన్29. రఘుపత్ సింగ్30. రఘువీర్ తుకారాం ఖేద్కర్31. రాజస్తపతి కాలియప్ప గౌండర్32. ఆర్మిడా ఫెర్నాండెజ్233. రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే34. SG. సుశీలమ్మ35. సంగ్యుసాంగ్ ఎస్ పొంగెనర్36. షఫీ షౌక్37. శ్రీరంగ్ దేవబ లాడ్38. శ్యామ్ సుందర్39. సిమాంచల్ పాత్రో40. సురేష్ హనగవాడి41. తగా రామ్ భీల్42. టెకీ గుబిన్43. తిరువారూర్ భక్తవత్సలం44. విశ్వ బంధు45. యుమ్నం జత్రా సింగ్


