పలు విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 45 మందికి కేంద్రం పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. జన్యుసంబంధ విభాగంలో పరిశోధనలకు డాక్టర్ కుమార స్వామి తంగరాజుకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. హైదరాబాద్‌లోని సీసీఎంబీలో డాక్టర్ తంగరాజా శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పాడి, పశుసంవర్థక శాఖలో అత్యున్నత సేవలకు గానూ కేంద్రం పద్మశ్రీ అవార్డు అందించింది.
పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం అందించే నాలుగవ అత్యన్నత అవార్డు. కళలు, విద్య, సాహిత్యం, క్రీడలు, వైద్యం, సామాజికసేవ, పరిశ్రమలు, వైద్యం, ప్రజాసేవలు ఇలా విభిన్న రంగాలలో ఉత్తమ సేవలు కనబరిచిన వ్యక్తులకు ఈ అవార్డు అందిస్తారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును కేంద్రం ప్రకటిస్తుంది. పురస్కార గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీతలు
1. కుమారసామి తంగరాజ్
2 మామిడి రామారెడ్డి ( తెలంగాణ)
3. భగవందాస్ రైక్వార్
4. భిక్ల్య లడక్య ధిండా
5. బ్రిజ్ లాల్ భట్
6. బుధ్రి తాటి
7. చరణ్ హెంబ్రామ్
8. చిరంజీ లాల్ యాదవ్
9. ధర్మైక్ లాల్ చునీలాల్ పాండ్యా
10. గఫ్రుద్దీన్ మేవాటి జోగి
11. హాలీ వార్
12. ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ
13. కె. పజనివేల్
14. కైలాష్ చంద్ర పంత్
15. కేమ్ రాజ్ సుంద్రియాల్
16. కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి
17.అంకె గౌడ
18. మహేంద్ర కుమార్ మిశ్రా
19. మీర్ హాజీభాయ్ కసంభాయ్
20. మోహన్ నగర్
21. నరేష్ చంద్ర దేవ్ వర్మ
22. నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా
23. నూరుద్దీన్ అహ్మద్
24. ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్
25. పద్మ గుర్మెట్
26. పోఖిల లెక్తేపి
27. పున్నిమూర్తి నటేశన్
28. ఆర్ కృష్ణన్
29. రఘుపత్ సింగ్
30. రఘువీర్ తుకారాం ఖేద్కర్
31. రాజస్తపతి కాలియప్ప గౌండర్
32. ఆర్మిడా ఫెర్నాండెజ్2
33. రామచంద్ర గాడ్బోలే మరియు సునీతా గాడ్బోలే
34. SG. సుశీలమ్మ
35. సంగ్యుసాంగ్ ఎస్ పొంగెనర్
36. షఫీ షౌక్
37. శ్రీరంగ్ దేవబ లాడ్
38. శ్యామ్ సుందర్
39. సిమాంచల్ పాత్రో
40. సురేష్ హనగవాడి
41. తగా రామ్ భీల్
42. టెకీ గుబిన్
43. తిరువారూర్ భక్తవత్సలం
44. విశ్వ బంధు
45. యుమ్నం జత్రా సింగ్


