పిన్నెల్లి: టీడీపీ శ్రేణుల చేతిలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త మందా సాల్మన్ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించనున్నారు.. దీనిలో భాగంగా పల్నాడు జిల్లా పిన్నెల్లికి బయల్దేరారు పలువురు పార్టీ నేతలు. నరసారావుపేట నుంచి పిన్నెల్లికి బయల్దేరి ముందు వార మీడియాతో మాట్లాడారు.

ఈ మేరకు ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడ నడిబొడ్డులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కూటమి వచ్చిన తర్వాత మొదటి దాడి అంబేద్కర్ విగ్రహం మీదే జరిగింది. తర్వాత రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నాయి. అంధ్రప్రదేశ్‌లో అరాచకాలను కేంద్రంకి చెపుతూనే ఉన్నాం.సిరియా కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్‌లో దాడులు జరుగుతున్నాయి.దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఢిల్లీ లో ధర్నా చేపట్టనున్నాం’ అని తెలిపారు.
మాజీ హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘ విజనరి పాలన అని చెప్పుకొనే వ్యక్తి ప్రజల్ని గ్రామాల్లో లేకుండా చేస్తున్నారు. 2019 నుండి 2024 వరకు గ్రామాలు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళను తిరిగి గ్రామాలకు తీసుకొని వచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామాలు వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చింది. మరియమ్మ రాళ్ళ దాడిలో చనిపోతే ఆర్థికంగా ఆదుకోవమే కాదు. కుటుంబానికి భరోసా కల్పించిన ఘటన జగన్ ప్రభుత్వంది. మళ్ళీ జగన్ వస్తాడు.. ప్రజాస్వామ్యం వస్తుందనే భయం కూటమిలో కనిపిస్తుంది.

మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. ‘ రాజకీయాలను చంద్రబాబు దుర్మార్గం వైపు తీసుకొని వెళ్తున్నారు. హత్యాచారాలు, హత్యలు, దాడులు చేస్తున్న వాళ్ళ కి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. దాచేపల్లి సీఐ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తోపులు అనుకునే వాళ్లను చూశాం. అలాంటి వాళ్లన లాగి పక్కన పెట్టేశాం. శాంతి భద్రతలు కాపాడలేకపోతే పీఎస్‌కి ఎందుకు పోవడం? ’ అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ‘ సాల్మన్ హత్య పాశవికమైనది.. ప్రజాస్వామ్యాన్నీ అపహాస్యం చేస్తుంది. సాల్మన్ హత్య పై డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తే కానీ వినతిపత్రం తీసుకోలేదు. వినతిపత్రం తీసుకున్నా నేటికి సాల్మన్ హత్య పై విచారణ లేదు’అని మండిపడ్డారు.
మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘ ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన హత్య. రెడ్ బుక్ పాలన లో రాష్ట్రం రక్త పాతంగా మారింది. రాష్ట్రంలో సెలెక్టివ్ గా పాలన, సెలెక్టివ్ గా న్యాయం చేస్తున్నారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఎమ్మెల్యే లేదా ఎంపీ చెప్పాలి. న్యాయం కోసం సామాన్యుడు పోరాటం చేస్తే అతని మీదనే కేసు పెడుతున్నారు. పోలీసులు ప్రజలను భయపెడుతున్నారు.’ అని ధ్వజమెత్తారు.


