ముంబై మేయర్‌ ఎంపికలో బిగ్‌ ట్విస్ట్‌! | Mumbai to get woman mayor But Uddhav Sena objects | Sakshi
Sakshi News home page

ముంబై మేయర్‌ ఎంపికలో బిగ్‌ ట్విస్ట్‌!

Jan 22 2026 3:40 PM | Updated on Jan 22 2026 3:50 PM

Mumbai to get woman mayor But Uddhav Sena objects

ముంబై: మహారాష్ట్రలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. ముంబై మేయర్‌ విషయంలో ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ముంబై మేయర్‌ పోస్టును ఏ కేటగిరికి కేటాయించాలి? అనే అంశంపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్‌ మహిళ’ కేటగిరీ ఎంపిక కావడంపై ఉద్దవ్‌ థాక్రే శివసేన వ్యతిరేకిస్తోంది. దీంతో, మేయర్‌ స్థానంపై ఉత్కంఠ నెలకొంది.

వివరాల మేరకు.. ముంబై మహిళా మేయర్‌ రానున్నారు. అయితే, సదరు మహిళా మేయర్‌.. ఏ కేటగిరి నుంచి రావాలనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, ఈ పోస్ట్‌ను ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై లాటరీ తీశారు. ఫలితాల్లో ‘జనరల్‌ మహిళ’ కేటగిరీ ఎంపికైంది. కాగా, ఈ లాటరీ ప్రక్రియ, ఫలితంపై ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది గందరగోళ పరిస్థితులకు దారితీసింది.  బీఎంసీని ఓబీసీ కేటగిరీ కింద ఎందుకు పరిగణించలేదని మాజీ మేయర్ కిశోరి ఫడ్నేకర్ ప్రశ్నించారు. గతంలో రెండు దఫాలు కూడా ఈ పోస్టు ఓపెన్ కేటగిరీలోనే ఉందని గుర్తుచేశారు. అనంతరం, సభ నుంచి ఉద్దవ్‌ వర్గం సభ్యులు బయటకు వెళ్లిపోయారు. దీంతో, మేయర్‌ స్థానంలో ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు.. మేయర్ పదవి కోసం డ్రా పూర్తయిన తర్వాత బీఎంసీలోని అర్హులైన కార్పొరేటర్లు నామినేషన్లు వేసేందుకు వీలవుతుంది. ఈ లాటరీ ప్రక్రియ తర్వాత పుణె, ధూలే, బీఎంసీ, నాందేడ్‌, నవీ ముంబయి, మాలేగావ్‌, మీరా భయందర్, నాసిక్, నాగ్‌పుర్ మేయర్‌ పోస్టులు మహిళలకు రిజర్వ్‌ అయ్యాయి. అలాగే.. లాతూర్, జల్నా, థానే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్సీ) రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో లాతూర్, జల్నా ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయబడింది. మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విభాగానికి రిజర్వ్ చేయబడ్డాయి. వీటిలో అకోలా, చంద్రపూర్, అహిల్యానగర్, జల్గావ్ ఓబీసీ మహిళలకు రిజర్వ్ చేయబడగా.. పన్వెల్, ఇచల్‌కరంజి, కొల్హాపూర్, ఉల్హాస్‌నగర్ ఓబీసీ అభ్యర్థులకు కేటాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement